మంచు విష్ణుకి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒకప్పుడు బ్లాక్ బస్టర్ మూవీస్ చేసాడు. అల్లుడుగారు, పెదరాయుడు, మేజర్ చంద్రకాంత్, యమ ధర్మరాజు ఎం ఏ ఇలా ఎన్నో సక్సెస్ సినిమాలతో డైలాగ్ కింగ్ మోహన్ బాబు కలెక్షన్ కింగ్ అయ్యాడు. ఆయన తనయులు మంచు విష్ణు, మంచు మనోజ్ టాలీవుడ్ హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.

మంచు విష్ణు కూడా హీరోగా తనకంటూ ఇమేజ్ తెచ్చుకున్నాడు. 2003లో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమా ప్లాప్ కావడంతో ఆతర్వాత శ్రీను వైట్ల డైరెక్షన్ లో వచ్చిన ఢీ మూవీ సూపర్ డూపర్ హిట్ కొట్టింది. దర్శకుడుగా, నిర్మాతగా కూడా ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణు తన సిస్టర్ మంచు లక్ష్మితో లక్ష్మీ టాక్స్ షో, ప్రేమతో మీ లక్ష్మి వంటి ప్రోగ్రామ్స్ డైరెక్ట్ చేసాడు.

24ఫిలిం ఫ్యాక్టరీ అనే నిర్మాణ సంస్థను కూడా విష్ణు నెలకొల్పి తన మూవీస్ తో పాటు తండ్రి మూవీస్ కూడా నిర్మించడం చేస్తున్నారు. అలాగే వ్యాపార రంగంలో కూడా అడుగుపెట్టి లాభాలు అందుకున్నాడు. శ్రీ విద్యా నికేతన్ కూడా విష్ణు నిర్వహిస్తున్నాడు. అలాగే కొన్ని బిజినెస్ లలో లాభాలు ఆర్జిస్తున్నాడు.ఇలా అన్నీ వైపులనుండి కోట్లను సంపాదిస్తున్నాడు.

మంచు విష్ణుకి దాదాపుగా 1900 కోట్ల ఆస్తి ఉంటుందని ఒక అంచనా. ఒక వైపు కాలేజీలు,బిజినెస్ లు చూసుకుంటూ మరో వైపు సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నాడు.