రంగస్థలం మూవీకి పోటీగా వచ్చిన సినిమాల పరిస్థితి ఏమిటో…?

సుకుమార్, రామ్ చరణ్ కాంబోలో వచ్చిన రంగస్థలం మూవీ బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాదు, ఇండస్ట్రీ హిట్ కొట్టింది. నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అయింది. సమంత హీరోయిన్ గా చేసిన ఈ మూవీలో చెవిటివాడైన చిట్టిబాబుగా చెర్రీ నటన కొత్తకోణంలో ఆవిష్కరించారు. అనసూయ, ఆది తదితరుల నటన ఆకట్టుకుంది. దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ సూపర్భ్.

ఈ మూవీకి రెండు వారాల ముందుగా మార్చి 16న కర్తవ్యమ్ మూవీ రిలీజయింది. నయనతార జిల్లా కలెక్టర్ గా పవర్ ఫుల్ రోల్ ప్లే చేసింది. గోపీనాయనార్ డైరెక్టర్. అయితే తెలుగులో ఫెయిల్ అయింది. రంగస్థలానికి రెండు వారాల ముందుగా వచ్చిన మార్చి 16నే వచ్చిన దండుపాళ్యం 3 మూవీ క్రైమ్ సిరీస్ లో మూడవ సినిమా. శ్రీనివాసరాజు డైరెక్టర్. అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేదు.

ఇక అదేరోజు కిరాక్ పార్టీ మూవీ వచ్చింది. శరన్ కొప్పిశెట్టి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నిఖిల్ హీరో. ప్లాప్ గా మిగిలింది. మార్చి 17న వచ్చిన మనసైనోడు మూవీ ని సత్యవరపు వేంకటేశ్వరరావు తెరకెక్కించారు. మనోజ్ నందన్, ప్రియా సింధ్ జంటగా నటించిన ఈ మూవీ కూడా నిరాశపరిచింది. రంగస్థలానికి వారం ముందు మార్చి 23న వచ్చిన నీది నాది ఒకే కథ మూవీని వేణు ఉడుగుల తెరకెక్కించాడు. శ్రీ విష్ణు హీరోగా నటించాడు. కమర్షియల్ గా సక్సెస్ అందుకుంది. ఇక అదేరోజు రాజరధం మూవీ రిలీజయింది. నిరూప్ బంధారి నటించిన ఈ మూవీ కన్నడ డబ్బింగ్. తెలుగులో ప్లాపయింది.

ఇదేరోజున నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ఎమ్మెల్యే మంచి లక్షణాలున్న అబ్బాయి మూవీ వచ్చింది. ఉపేంద్ర మాధవ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ కాజల్ అగర్వాల్ హీరోయిన్. ఈ మూవీ తక్కువ లాభాలతో బయటపడింది. అలాగే అనగనగా ఒకరోజు అనే మూవీ రిలీజయింది. సాయికృష్ణ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో సుమన్ కీలక పాత్ర పోషించాడు. అయితే ప్లాప్ అయింది. దీని తర్వాత రంగస్థలం మూవీ వచ్చి ఇండస్ట్రీ హిట్ కొట్టింది.

దీని తర్వాత ఏప్రియల్ 5న నితిన్ నటించిన చల్ మోహన్ రంగా మూవీ వచ్చింది. ఇది ప్లాప్ అయింది. ఏప్రియల్ 7న ప్రభాస్ నిమ్మల డైరెక్షన్ లో అంతా కొత్తవారితో తెరకెక్కిన సత్యగాంగ్ మూవీ వచ్చింది. ఇదీ నిరాశపరిచింది. ఇంతలో ఎన్నెన్ని వింతలో మూవీ అదేరోజు వచ్చింది. నందు హీరోగా వచ్చిన ఈ మూవీకి వరప్రసాద్ వరకూటి డైరెక్టర్. ఇదీ ప్లాప్ అయింది.

ప్రభుదేవా ప్రధాన పాత్రలో వచ్చిన గుళేభాకావళి మూవీ ని కళ్యాణ్ తెరకెక్కించాడు. ఈ మూవీ నిరాశ పరిచింది. రంగస్థలానికి 13రోజుల గ్యాప్ తో నేచురల్ స్టార్ నాని నటించిన కృష్ణార్జున యుద్ధం మూవీ వచ్చింది. మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేసాడు. ఇది కమర్షియల్ గా సక్సెస్ సాధించలేదు. అలాగే మెర్క్యురీ, అమెరికా టు అంబర్ పేట మూవీస్ వచ్చి నిరాశపరిచాయి. ఇక రంగస్థలానికి మూడు వారాల తర్వాత వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేసిన భరత్ అనే నేను. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అలరించింది. ఈ మూవీ అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది.