రకుల్ బాయ్ ఫ్రెండ్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

ఓపక్క నాగచైతన్య, సమంత విడాకులు తీసుకోవడం హాట్ టాపిక్ గా మారితే, మరోపక్క స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ బాయ్ ఫ్రెండ్ తో త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది. గత కొంతకాలంగా సీక్రెట్‌గా ప్రేమ వ్యవహరం సాగిస్తున్న రకుల్‌ తాజాగా వారి రిలేషన్‌ను సోషల్‌ మీడియాలో అధికారికంగా ప్రకటించింది. దీంతో అతడెవరా అని ఆసక్తి నెలకొంది.

కాగా తాజాగా రకుల్‌ బర్త్‌డే కూడా జరుపుకోవడంతో ఆమెకు 31వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఆమె ప్రపంచానికి తన ప్రేమను పరిచయం చేసింది. రకుల్ బాయ్ ఫ్రెండ్ పేరు జాకీ భగ్నానీ. యితడు బాలీవుడ్‌ హీరో, నిర్మాత కూడా. జాకీ భగ్నానీ ఈ ఏడాది తనకు దొరికిన అతి పెద్ద గిఫ్ట్‌గా రకుల్‌ పెర్కొంది. అధికారికంగా బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పడంతో అతడితోనే రకుల్‌ త్వరలోనే మూడుముళ్లు వేయించుకుంటుందని చెప్పవచ్చు.

తన ఇన్‌స్టాగ్రామ్‌లో జాకీ బగ్నాని చేతిని పట్టుకుని నడుస్తున్న ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘నా జీవితంలో ఎన్నో రంగులను జత చేశావు. ఈ ఏడాది నాకు దొరికిన అతి పెద్ద గిఫ్ట్‌ నువ్వు. నన్ను ఎప్పుడూ నవ్విస్తూనే ఉంటావు. ఇలా ఇద్దరం కలిసి ఇంకా ఎన్నో మధర జ్ఞాపకాలను తయారు చేసుకుందాం’ అంటూ హార్ట్‌ ఎమోజీలను జతచేసింది.