రవిరాజా పినిశెట్టి కెరీర్ లో బెస్ట్ సినిమాలు ఇవే…మీరు చూసారా…?

Tollywood Director Ravi Raja Pinisetty :డైరెక్టర్లలో రవిరాజా పినిశెట్టి ఒకప్పుడు తనకంటూ ఇమేజ్ తో దూసుకెళ్లి పలువురు అగ్ర హీరోలకు హిట్స్ అందించారు. విక్టరీ వెంకటేష్ , మీనా జంటగా వచ్చిన మరో రీమేక్ మూవీ చంటి. అయితే ఒరిజనల్ తమిళ మూవీ కన్నా చంటి తెలుగు మూవీ ఇండస్ట్రీ హిట్ అయింది. 1992లో విడుదలైన ఈ మూవీ ఇళయరాజా మ్యూజిక్ అదనపు బలాన్ని ఇచ్చాయి. మాస్ అండ్ కమర్షియల్ అంశాలతో తెరకెక్కిన యముడికి మొగుడు మూవీలో మెగాస్టార్ చిరంజీవి డబుల్ రోల్ లో అద్భుత నటన కనబరిచాడు. విజయశాంతి, రాధ హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీకి రాజ్ కోటి సంగీతం సూపర్భ్. 1988లో వచ్చిన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ ఇచ్చి, రవిరాజా పినిశెట్టికి కెరీర్ ని మలుపు తిప్పింది.

రవిరాజా పినిశెట్టి కొత్త టాలెంట్ ని చూపిస్తూ రాజేంద్ర ప్రసాద్, సీత లతో తెరకెక్కించిన ముత్యమంత ముద్దు మూవీ 1989లో రిలీజయింది. ఇళయరాజా మ్యూజిక్ అందించగా, యండమూరి వీరేంద్రనాధ్ కథ ఆధారంగా తెరకెక్కింది. శోభన్ బాబు, డాక్టర్ రాజశేఖర్ హీరోలుగా తెరకెక్కించిన బలరామకృష్ణులు మూవీ లో జగపతి బాబు ప్రధాన పాత్ర చేసాడు. ఆద్యంతం చక్కని ఫ్యామిలీ డ్రామాతో తెరకెక్కించిన ఈ మూవీ 1992లో రిలీజయింది. రాజ్ కోటి మ్యూజిక్ అందించిన ఈ మూవీ మంచి విజయాన్ని నమోదుచేసింది. వెంకటేష్ , సుమన్ లతో మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కించిన కొండపల్లి రాజా 1993లో రిలీజై, మంచి విజయాన్ని అందుకుంది. ఎం ఎం కీరవాణి మ్యూజిక్ అందించారు.

ట్రయాంగిల్ లవ్ స్టోరీతో బాలయ్య నటించిన బంగారు బుల్లోడు మూవీ 1993లో రిలీజయింది. రాజ్ కోటి మ్యూజిక్ అందించాడు. సినిమా మంచి విజయాన్ని అందుకుంది.ముఖ్యంగా డైలాగ్ కింగ్ మోహన్ బాబు హీరోగా నటించిన పెదరాయుడు మూవీ గురించి చెప్పాలి. రజనీకాంత్ ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీలో మోహన్ బాబు డబుల్ రోల్ చేసాడు. భానుప్రియ, సౌందర్య హీరోయిన్స్ గా నటించారు. 1995లో రిలీజై, ఇండస్ట్రీ హిట్ కొట్టింది. తమిళ మూవీకి రీమేక్ గా వచ్చిన ఈ మూవీ కి కోటి అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణ.

వినీత్ హీరోగా, నాగబాబు కీలక పాత్ర పోషించిన రుక్మిణి మూవీ కి విద్యాసాగర్ మంచి సాంగ్స్ అందించాడు. 1997లో వచ్చిన ఈ మూవీలో నిజజీవితంలో తండ్రీకూతుళ్ళు అయిన విజయకుమార్ , ప్రీతి తండ్రీ కూతుళ్లుగా నటించడం విశేషం. జగపతి బాబు హీరోగా తెరకెక్కించిన అల్లుడుగారు వచ్చారు మూవీ లో కౌసల్య హీరోయిన్. ఎం ఎం కీరవాణి మ్యూజిక్ అందించిన ఈ మూవీ 1999లో వచ్చి, మంచి విజయాన్ని అందుకుంది. యాంగ్రీ యంగ్ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్ హీరోగా నటించిన మా అన్నయ్య మూవీ కి ఎస్ ఏ రాజ్ కుమార్ సూపర్ మ్యూజిక్ ఇచ్చాడు. 2000సంవత్సరంలో విడుదలైన ఈ మూవీ ఫామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుని అద్భుత విజయాన్ని అందుకుంది.