మావిచిగురు సినిమాకి పోటీగా వచ్చిన సినిమాల పరిస్థితి…?

Maavichiguru full movie : ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లో జగపతి బాబు,ఆమని జంటగా తెరకెక్కిన మావిచిగురు మూవీ 1996 మే 30న రిలీజై, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.ఫ్యామిలీ ఆడియన్స్ ని విశేషంగా అలరించింది. జగపతి బాబుకి ఉత్తమనటుడు నంది అవార్డు వచ్చింది. మహిళా ఆడియన్స్ ని విశేషంగా అలరించింది.

ఇక ఈ సినిమాకు పోటీగా వచ్చిన సినిమాలను చూస్తే, సుమన్, కృష్ణంరాజు నటించిన నాయుడుగారి కుటుంబం మూవీ మావిచిగురుతో పాటు అదేరోజు రిలీజయింది. డాక్టర్ డి రామానాయుడు నిర్మించిన ఈ మూవీ బోయిన సుబ్బారావు తెరకెక్కించారు. డైలాగ్స్ అందించిన పరుచూరి సోదరులకు నంది అవార్డు తెచ్చిన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది.

ఇక బాలకృష్ణ నటించిన శ్రీ కృష్ణార్జున యుద్ధం మే 15న రిలీజయింది. కృష్ణుడుగా, అర్జునుడుగా బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ నిరాశపరిచింది. సింగీతం శ్రీనివాసరావు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రోజా ద్రౌపదిగా నటించింది. రియల్ స్టార్ శ్రీహరి దుర్యోధనుడిగా నటించారు. సంగీతం అందించిన మాధవపెద్ది సురేష్ కి నంది అవార్డు వచ్చింది.

మే 24న అల్లరి మొగుడు అనుమానం పెళ్ళాం మూవీ రిలీజయింది. హిందీ మూవీకి డబ్బింగ్ గా వచ్చిన ఈ మూవీ లో కమల్ హాసన్ నటించాడు. తెలుగులో నిరాశపరిచింది.అక్కినేని నాగేశ్వరరావు, దాసరి నారాయణరావు నటించిన నాయుడు గారు రాయుడు గారు మూవీ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కింది. జూన్ 12న రిలీజైన ఈ మూవీలో వినోద్ కుమార్, రోజా ప్రధాన పాత్రలు పోషించారు. అయితే సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. దాంతో ఆ ఏడాది మావిచిగురు మూవీ బ్లాక్ బస్టర్ తో మొదటి స్థానంలో నిల్చింది. నాయుడుగారి కుటుంబం విజయాన్ని నమోదుచేసుకుని రెండవ స్థానంలో నిల్చింది.