Movies

సినిమా డిజాస్టర్ అయినా హీరోల నటన సూపర్…సినిమాలు ఇవే..?

Tollywood Flop Movies :కోట్లు వెచ్చించి,ఎన్నో రోజులు కష్టపడి ఎంతో మంది నటీనటులు,సాంకేతిక నిపుణులు పనిచేస్తే ఒక సినిమా తయారవుతుంది. అయితే ఆడియన్స్ సినిమా చూసి ఒక్క ముక్కలో బాగుందో లేదో చెప్పేస్తారు. హిట్ అనుకున్న మూవీ ప్లాప్ అవుతుంది. ప్లాప్ అవుతుందనుకుంటే హిట్ అవుతుంది. ఇందులో పెద్దా చిన్నా తేడా లేకుండా అందరి హీరోల మూవీస్ ఉంటాయి.

నేచురల్ స్టార్ నాని, సమంత నటించిన ఏటో వెళ్ళిపోయింది మనసు మూవీ ప్లాప్ టాక్ తెచ్చుకున్నా, ఇందులో నాని, సమంత ల నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలూ కూడా దారుణంగా దెబ్బతిన్నాయి. అలాగే జెండాపై కపిరాజు మూవీ ప్లాప్ అయింది. కానీ ఈ మూవీస్ లో నటీనటుల నటనకు మంచి పేరొచ్చింది.

తేజ డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన నిజం సినిమా తీవ్ర నిరాశ పరిచినా, ఈ సినిమాలో మహేష్ యాక్షన్ కి మంచి మార్కులు పడ్డాయి. అలాగే స్పైడర్ మూవీ దెబ్బతిన్నప్పిటికీ ఇందులో ఎస్ జె సూర్య నటన హైలెట్ అయింది. అలాగే బ్రహోత్సవం మూవీ డిజాస్టర్ అయినా, ఇందులో రావు రమేష్ నటన అదిరిడింది. అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య సినిమా ప్లాప్ అయినా అల్లు అర్జున్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."