ఈ బాలీవుడ్ స్టార్స్ మొదటి సంపాదన ఎంతో తెలుసా ?

Bollywood star heroes first salary :కింది స్థాయి నుంచి పైకి ఎదిగిన స్టార్ హీరోలు కొందరు తమ మూలలను మర్చిపోరు. ఎక్కడో అక్కడ తమ పాత రోజులను గుర్తుచేసుకుంటారు. మొదట్లో తక్కువ సొమ్ము తీసుకుని పనిచేసినా ఇప్పుడు కోట్లలో రెమ్యునరేషన్ అందు కుంటున్నారు. ఇక బిగ్ బి అమితాబ్ బచ్చన్ సినిమాల్లో కాకుండా టివి షోస్,యాడ్స్ చేస్తూ ఇప్పటికీ సంపాదనలో దూసుకెళ్తున్నారు.

అయితే ఈయన మొదట్లో షా వాలెస్ షిప్పింగ్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ గా, రవాణా బ్రోకర్ గా పనిచేస్తూ 500రూపాయలు సంపాదించేవారు. అలాగే బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తొలిరోజుల్లో పంకజ్ ఉధాస్ కచేరీలో పనిచేస్తూ నెలకు 50రూపాయలు వేతనం అందుకునేవారు. బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తన మొదటి సినిమా ఖాయమఖ్ సే ఖాయమఖ్ తో మూవీలో నటించి, వెయ్యి రూపాయలు రెమ్యునరేషన్ అందుకున్నాడు.

ఇక అక్షయ్ కుమార్ ఇండస్ట్రీలోకి రాకముందు తొలిసంపాదనగా 15వందల రూపాయలు అందుకున్నారు. ఇలాగే పలువురు హీరోలు, హీరోయిన్స్ మొదటి సినిమాలో అతి తక్కువ రెమ్యునరేషన్ అందుకున్నప్పటికీ స్టార్ డమ్ వచ్చాక కోట్లలో అందుకుంటున్నారు.