Movies

అమ్మ,అత్త పాత్రల్లో నటించే వారికి డిమాండ్…రెమ్యునరేషన్…?

Highest paid mothers in tollywood remuneration : ఇండస్ట్రీలో హీరో ,హీరోయిన్స్ తో పాటు కీలకమైన అమ్మా, అత్తా పాత్రల్లో నటించేవారికి మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఒకప్పుడు హీరోయిన్స్ గా, సైడ్ హీరోయిన్స్ గా నటించిన వారికి భారీ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ ఇలాంటి పాత్రలకు సెలెక్ట్ చేస్తున్నారు. దీంతో సెకండ్ ఇన్నింగ్స్ లో సైతం కొందరు తడాఖా చూపిస్తున్నారు.

సహజ నటిగా గుర్తింపు పొందిన జయసుధ ఒకప్పుడు హీరోయిన్ గా టాప్ రేంజ్ కి చేరుకుంది. ఇప్పుడు అమ్మ,నానమ్మ పాత్రలకు ఒకే చెబుతూ పలు సినిమాల్లో దూసుకెళ్తున్న జయసుధ ఒక్కో రోజుకి రెండు లక్షల రూపాయలు అందుకుంటోంది. అలాగే అత్తారింటికి దారేది మూవీతో సత్తా చాటిన నదియా కూడా ఒక్కో రోజుకి రెండు లక్షలు అందుకుంటోంది.

అలాగే ఒకప్పుడు హీరోయిన్ గా ప్రాధాన్యత గల పాత్రల్లో మెప్పించిన రేవతి ప్రస్తుతం ఒక్కో సినిమాకు పాతిక లక్షల వరకూ అందుకుంటోంది. ఇలా టాలెంట్ గల వారికి బాగానే రెమ్యునరేషన్ వస్తోంది. ఇక నటి శరణ్య, పవిత్ర లోకేష్ కూడా రోజుకి 40వేల నుంచి 50వేలు పారితోషికం అందుకుంటున్నారు. తులసి 40 వేల వరకు రోజుకి తీసుకుంటుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."