MoviesTollywood news in telugu

టాలీవుడ్ హీరోలకు లైఫ్ ఇచ్చి నిలబెట్టిన సినిమాలు

Tollywood Heroes Movies :సినీ రంగంలో నిలదొక్కుకోవాలంటే టాలెంట్ తో పాటు అదృష్టం కూడా తోడవ్వాలి. ఒక్కోసారి ఎంచుకొనే సినిమాల విషయంలో తప్పు చేయటం లేదా ప్రేక్షకులకు కనెక్ట్ కాకపోవటం వంటి కారణాలతో కొన్ని సినిమాలు ఫట్ మంటాయి. మరల హిట్ బాట పట్టాలంటే చాలా సమయం పడుతుంది. ఆ విధంగా ప్లాప్స్ లో ఉన్న హీరోలు మరల ఫామ్ లోకి రావటానికి సహాయపడిన సినిమాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

టెంపర్ 
ఎన్టీఆర్ ఎంత లెంత్ ఉన్న డైలాగ్ అయినా సింగిల్ టెక్ లో చెప్పేస్తాడు. అటువంటి ఎన్టీఆర్ కి ‘యమదొంగ’ తర్వాత సరైన హిట్ పడలేదు. ఆ లోటుని ‘టెంపర్’ సినిమా తీర్చింది.

సింహ 
నందమూరి నట సింహం బాలకృష్ణకు ‘సమరసింహా రెడ్డి’ సినిమా తర్వాత చాలా సంవత్సరాల వరకు సరైన హిట్ దొరకలేదు. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ‘సింహ’ బాలకృష్ణకు మంచి హిట్ ని ఇవ్వటమే కాకుండా ఎన్నో రికార్డ్స్ తిరగ రాసింది. 

గబ్బర్ సింగ్
పవర్ స్టార్ కి అభిమానులు హిట్, ప్లాప్ లతో సంబంధం లేకుండా అభిమానం చూపుతూ ఉంటారు. పది సంవత్సరాల పాటు హిట్ లేని పవన్ కి ‘గబ్బర్ సింగ్’ సూపర్ డూపర్ విజయాన్ని అందించింది. ఈ సినిమాలో తిక్క పోలిస్ ఆఫీసర్ గా నటించి అభిమానులను అలరించాడు. 

దూకుడు 
మహేష్ బాబు,మాటల మాంత్రికుడు తివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘అతడు’ సినిమా విడుదల అయిన మూడు సంవత్సరాల వరకు మహేష్ కి హిట్ లేదు. అన్ని సినిమాలు ప్లాప్ అయ్యి నిస్తేజం వచ్చిన సమయంలో వచ్చిన ‘దూకుడు’ మంచి బూస్టింగ్ ఇచ్చింది. 

డార్లింగ్ 
ప్రభాస్,రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ‘ఛత్రపతి’ సినిమా తర్వాత 5 సంవత్సరాల వరకు ప్రభాస్ కి హిట్ అనేదే లేకుండా పోయింది. అలాంటి సమయంలో కరుణాకర్ దర్శకత్వంలో చేసిన ‘డార్లింగ్’ సినిమా సూపర్ హిట్ అయ్యి ప్రభాస్ ని ఒక రేంజ్ లో నిలబెట్టింది. 

బలుపు 
రవితేజ,హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ‘మిరపకాయ’ సినిమా తర్వాత హిట్ ట్రాక్ ఎక్కటానికి ‘బలుపు’ వరకు ఆగవలసి వచ్చింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."