MoviesTollywood news in telugu

పుష్ప ప్రమోషన్స్ వర్క్ పై బన్నీ పక్కా ప్లాన్…మామూలుగా లేదుగా…?

Allu Arjun Pushpa movie :ఆర్య‌,ఆర్య 2 చిత్రాల త‌ర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో రూపొందుతోన్న పుష్ప మూవీపై భారీ అంచనాలున్నాయి. పైగా వీరిద్దరి కాంబోలో ముచ్చటగా మూడో చిత్రం కావ‌డం, పుష్ప సినిమాలో పాత్రను ఎలివేట్ చేసేలా వచ్చిన క్యారెక్టర్ టీజర్‌కు, విడుదలైన రెండు సాంగ్స్‌ కి రెస్పాన్స్ ఉండడంతో పాటు రంగస్థ‌లం వంటి ఇండస్ట్రీ హిట్ త‌ర్వాత సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న సినిమా కావడం వంటి పరిణామాల నేపథ్యంలో పుష్పపై అంచనాలు విపరీతంగా పెరిగాయి.

చిత్తూరు జిల్లా శేషాచ‌ల అడవుల్లో జ‌రిగే ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తీస్తున్న పుష్ప మూవీలో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌.ఇక మ‌ల‌యాళ స్టార్ ఫ‌హాద్ ఫాజిల్ విల‌న్‌గా చేస్తున్నాడు. గతం కన్నా భిన్నంగా డిఫ‌రెంట్ ఊర మాస్ లుక్‌లో పుష్పరాజ్ అనే లారీ డ్రైవ‌ర్ పాత్ర‌లో బన్నీ క‌నిపించ‌బోతున్నాడు.

మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ముత్తం శెట్టి మీడియా సంస్థ‌లు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్‌లో నిర్మిస్తున్నా యి. ఈ మూవీని మార్కెట్ ప‌రంగా వృద్ధి చేసుకోవాల‌ని బ‌న్నీ ఆలోచన. అందుకే పుష్ప సినిమాను ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ఆడియన్స్ ముందుకు తేబోతున్నాడు. ప్ర‌మోష‌న్స్ విష‌యంలోనూ కూడా ఏమాత్రం త‌గ్గ‌కుండా పుష్ప సినిమాను ఆడియెన్స్‌లోకి తీసుకెళ్లాల‌ని బ‌న్నీ ట్రై చేస్తున్నాడు.

ముఖ్యంగా ప్ర‌మోష‌న్స్ కోసం స్టైలిష్ స్టార్ భారీ ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేసుకున్నట్లు సినీ వ‌ర్గాల్లో టాక్. కరోనా నేపథ్యంలో ఇప్పటికే ఆలస్యం కావడంతో సౌత్ ఇండియా నాలుగు రాష్ట్రాల ముఖ్య ప‌ట్టణాల‌కు వెళ్లి ‘పుష్ప’ మూవీని ప్ర‌మోట్ చేయాల‌ని బ‌న్నీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. న‌వంబ‌ర్ రెండు,మూడు వారానికంతా సినిమా షూటింగ్ పూర్త‌వుతుంది.

దాంతో ఇక ఆలస్యం చేయకుండా న‌వంబ‌ర్ చివ‌రి వారం నుంచే ద‌క్షిణాది రాష్ట్రాల‌తో పాటు బాలీవుడ్‌లో ప్ర‌మోష‌న్స్‌ కి సంబంధించిన ప్లాన్ చేశారట. రెండు భాగాలుగా రూపొందుతోన్న పుష్ప మూవీలో తొలి భాగం‘పుష్ప ది రైజ్‌’ను డిసెంబ‌ర్ 17న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ఇప్పటికే ప్ర‌క‌టించారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."