చిన్న వయసులో పెళ్లాడిన హీరోయిన్స్ ఎంత మంది ఉన్నారో..?
Tollywood Star Heroine Marrage :బాలనటిగా పలు సినిమాల్లో అదరగొట్టి, సఖి వంటి సినిమాల్లో హీరోయిన్ గా సత్తా చాటిన షాలిని కెరీర్ బాగున్నప్పుడే అంటే 21ఏళ్లకే తమిళ నటుడు అజిత్ ని ప్రేమించి పెళ్లిచేసుకుంది. బాహుబలితో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయి పాన్ ఇండియా మూవీస్ లో చేస్తున్న ప్రభాస్ చాలా బిజీగా ఉన్నాడు.
అయితే ప్రభాస్ టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇస్తూ చేసిన ఈశ్వర్ మూవీలో నటించిన మంజుల కూతురు శ్రీదేవి 23ఏళ్ల వయస్సులో రాహుల్ అనే వ్యక్తిని పెళ్లాడింది. అలాగే బాలీవుడ్ హీరోయిన్ రాధిక ఆప్టే సైతం అదే వయస్సులో పెళ్లి చేసుకుంది.
బొబ్బిలిరాజా మూవీతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన దివ్యభారతి 18ఏళ్లకే బాలీవుడ్ నిర్మాత ప్రొడ్యూసర్ షాజిత్ ని పెళ్లాడింది. బొమ్మరిల్లు , ఢీ వంటి మూవీస్ తో అదరగొట్టిన బబ్లీ గర్ల్ జెనీలియా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగా 24వ యేట మహారాష్ట్ర సీఎం కొడుకు రితేష్ ని పెళ్లాడింది. అలాగే అదితి రావు హైదరి అయితే 21ఏళ్లకే పెళ్లిచేసుకుంది.

