చెల్లెలి కాపురం సీరియల్ మానస రియల్ లైఫ్ లో ఏమి చేస్తుందో…?
chelleli kapuram serial actress manasa :ప్రముఖ ఛానల్ లో ప్రసారమవుతున్న చెల్లెలి కాపురం సీరియల్ మంచి ఆదరణ పొందుతోంది. ఇందులో నటీ నటులు తమ నటనతో,అందంతో ఆకట్టు కుంటున్నారు. ఇక ఇందులో భూమిక చెల్లెలి పాత్రలో నటిస్తున్న మానస తన అభినయంతో,అందంతో క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పటికే పలు సీరియల్స్ లో పాజిటివ్,నెగెటివ్ రోల్స్ లో నటిస్తూ అలరిస్తోంది. తనకంటూ సొంత ఇమేజ్ తెచ్చుకుంది.
మానస అసలు పేరు సింధూజ. మార్చి 15న హైదరాబాద్ లో జన్మించిన ఈమెకు ఓ సిస్టర్,ఓ బ్రదర్ ఉన్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ వివేకానందలో పూర్తిచేసింది. జ్ఞానదీప్ కాలేజీలో చదువు పూర్తిచేసిన ఈమెకు చిన్నప్పటి నుంచి నటన అంటే ఇష్టం. దాంతో స్కూల్,కాలేజీ యాక్టివిటీస్ లో సింధూజ చురుగ్గా పాల్గొనేది.
స్టడీస్ పూర్తయ్యాక సింధూజ యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసింది. జెమిని టివిలో శ్రావణ సమీరాలు సీరియల్ తో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది. అగ్నిపూలు, పక్కింటి అమ్మాయి, సరదాగా కాసేపు, ముత్యాల ముగ్గు, రోజా బంధం,కల్యాణ వైభోగం, అక్క మొగుడు, అత్తారింటికి దారేది వంటి సీరియల్స్ లో నటించింది.

