గ్లామర్ కి కేరాఫ్ అడ్రెస్ .. అయినా విలనిజం చూపిన హీరోయిన్స్
Tollywood Heroines negative Roles :హీరోకి ఎంతటి వెయిట్ ఉంటుందో విలన్ కి అంతే ప్రాధాన్యత ఉంటుంది. టివి సీరియల్స్ లో గ్లామర్ ఒలగబోసే నటులు ఓపక్క హీరోయిన్స్, మరోపక్క విలన్స్ గా నటిస్తూ ఆడియన్స్ ని మెప్పిస్తున్నారు. ఇక సినిమాల్లో కూడా కొందరు హీరోయిన్స్ గ్లామర్ గా సత్తా చాటుతూ, మరోవైపు విలనిజంలో కూడా సత్తా చాటారు.
అలాంటి వాళ్ళల్లో కొందరిని ప్రస్తావిస్తే, సూపర్ స్టార్ కృష్ణ హీరోగా వచ్చిన గూఢాచారి 117లో భాను ప్రియ విలన్‌గా నటించింది. అందులో డబుల్ రోల్ చేసి, ఒక పాత్రలో విలనిజం పండించింది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా చేసిన నరసింహ సినిమాలో నీలాంబరిగా రమ్యకృష్ణ విలనిజాన్ని అదరగొట్టింది. అలాగే తాజాగా సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమాలో సైతం రమ్యకృష్ణ విలన్‌గా సత్తా చాటింది.
తన గ్లామర్ తో అదరగొట్టే సమంత.. విక్రమ్ హీరోగా వచ్చిన పత్తు ఎంద్రాకుల్లా సినిమాలో విలనిజంలో అలరించింది. అయితే ఆ మూవీ డిజాస్టర్ అయింది. ఒకప్పుడు సాఫ్ట్ రోల్స్ తో సత్తా చాటిన సౌందర్య మనసిస్తా రా సినిమాలో విలన్ గా సత్తా చాటింది. ఇందులో శ్రీకాంత్ హీరోగా చేసాడు. అయితే మూవీ నిరాశపరిచింది.
ధనుష్ హీరోగా వచ్చిన ధర్మయోగి సినిమాలో త్రిష విలనిజంతో మెప్పించింది. విశాల్ హీరోగా నటించిన చక్ర సినిమాతో విలన్‌గా మారిన రెజీనా దానికి ముందు అడవి శేష్ ఎవరు.. హవీష్ సెవెన్ సినిమాల్లో కూడా నెగిటివ్ షేడ్స్ లో మెప్పించింది. హీారోయిన్ ఆఫర్స్ తగ్గిపోవడంతో విలన్‌గా రాణించాలని చూస్తోంది.
ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ లేడీ విలన్స్‌లో వరలక్ష్మి శరత్ కుమార్ ని ప్రధానంగా చెప్పుకోవాలి. ఇప్పటికే చాలా సినిమాల్లో లేడీ విలన్‌గా మెప్పించింది తెలుగులో కూడా సందీప్ కిషన్ హీరోగా వచ్చిన తెనాలి రామకృష్ణలో విలన్‌గా నటించింది. క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో ఒదిగిపోయింది. ఉప్పెన మూవీలో కూడా అదరగొట్టింది.
నిజం సినిమాలో అందాల నటి రాశీ వాంప్ పాత్రతో కూడిన విలనిజం పండించింది. గోపీచంద్ కూడా విలనిజంలో అదరగొట్టేసింది.ఇక రీమా సేన్ అయితే, కార్తి యుగానికి ఒక్కడు, శింబు తెరకెక్కించిన వల్లభ సినిమాల్లో విలన్ పాత్రల్లో అదరగొట్టేసింది.
తేజ తెరకెక్కించిన సీత సినిమాలో చివరి వరకు కూడా కాజల్ విలన్ పాత్రలోనే నటించింది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా చేసాడు. అయితే చివరిలో పాజిటివ్ గా మారిపోతుంది. లారెన్స్ డైరెక్ట్ చేసిన డాన్ మూవీలో నిఖిత విలనిజం పండించింది. పొగరు సినిమాలో విశాల్‌ను సవాల్ చేసే పాత్రలో శ్రేయా రెడ్డి నటన అదుర్స్.

