MoviesTollywood news in telugu

రామ్ చరణ్ కారు డ్రైవర్ జీతం ఎంతో తెలుసా ?

Ram Charan Car driver salary :టాలీవుడ్ వారసత్వంలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తొలిసినిమా చిరుతతో హిట్ కొట్టాడు. తనకంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఇంకా తన మార్క్ చూపించడానికి కసరత్తు చేస్తున్నాడు. ఇప్పటికే టాలీవుడ్ లో టాప్ 5 హీరోలలో ఒకడిగా నిలిచాడు. తన 14 ఏళ్ళ కెరీర్‌లోనే మగధీర,రంగస్థలం లాంటి రెండు ఇండస్ట్రీ హిట్స్ అతడి ఖాతాలో పడ్డాయి.

నాయక్,ఎవడు, ధృవ లాంటి విజయాలు కూడా సాధించిన చెర్రీ గురించి తాజాగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. స్టాఫ్‌ను బాగా చూసుకోవడంలో mega హీరోలు ఎప్పుడూ ముందుంటారు. మరీ ముఖ్యంగా మెగా కుటుంబంలో అయితే చెప్పక్కర్లేదు. ఎందుకంటే చిరంజీవికి ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి దాదాపు 43 ఏళ్ళుగా ఒకే మేకప్ మెన్ ఉన్నాడు. అలాగే చెర్రీ కూడా సిబ్బందిని మార్చకుండా జాగ్రత్త పడుతున్నాడు.

ఇక రామ్ చరణ్ కారు డ్రైవర్ నెల జీతం నెలకు ఏకంగా 45 వేల ఇస్తున్నట్లు టాక్ నడుస్తోంది. దాదాపు ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి రేంజ్‌లోనే చరణ్ కార్ డ్రైవర్ కూడా జీతం ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ తో కల్సి చేస్తున్న సినిమాతో బిజీగా ఉన్న చరణ్ తాజాగా శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.