MoviesTollywood news in telugu

శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాకి పోటీ వచ్చిన సినిమాల పరిస్థితి…?

Chiranjeevi Shankar Dada MBBS Movie :మెగాస్టార్ చిరంజీవి హీరోగా జయంత్ సి పరాన్జీ డైరెక్షన్ లో వచ్చిన శంకర్ దాదా ఎంబిబిఎస్ మూవీ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. 2004 అక్టోబర్ 15న వచ్చిన ఈ మూవీ మెగా అభిమానులకు పండగ తెచ్చింది. సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ ఓ ప్రధాన పాత్ర పోషించాడు. కామెడీ,ఎమోషన్ తో సాగిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఉర్రూతలూగించింది.

అదేరోజు శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన ఆనంద్ మూవీ క్లాస్ ఆడియన్స్ ని అలరించి మంచి విజయాన్ని నమోదుచేసుకుంది. రాజా,కమిలిని ముఖర్జీ జంటగా నటించిన ఈ మూవీ ఇప్పటికీ మంచి కాఫీ లాంటి సినిమాగానే నిల్చింది.

శంకర్ దాదా ఎంబిబిఎస్ కి రెండు వారాల ముందుగా అక్టోబర్ 1న శ్రీకాంత్ నటించిన లేత మనసులు రిలీజయింది. ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఈ ఫ్యామిలీ డ్రామా పరాజయం పాలైంది. అక్టోబర్ 7న మోనాలిసా మూవీ వచ్చింది. సదా డబుల్ రోల్ చేసిన ఈ మూవీ కన్నడకు అనువాదం. అయితే ఇదీ పరాజయం పాలైంది.

అక్టోబర్ 8న వడ్డే నవీన్ హీరోగా శత్రువు మూవీ రిలీజయింది. ఎబో ఏవరేజ్ అయింది. రామ్ గోపాల్ వర్మ ప్రొడక్షన్ లో మఱ్ఱిచెట్టు హర్రర్ మూవీలో జెడి చక్రవర్తి కీలక పాత్ర పోషించాడు. సౌరబ్ సరాంగ్ డైరెక్ట్ చేసాడు. శంకర్ దాదా ఎంబిబిఎస్ కి వారం తర్వాత వచ్చిన ఈ మూవీ నిరాశ పరిచింది.

అలాగే శంకర్ దాదా ఎంబిబిఎస్ కి వారం తర్వాత మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి మూవీ వచ్చింది. వీరికింకా పెళ్ళికాలేదు టాగ్ లైన్ తో వచ్చిన ఈ మూవీలో శివాజీ, లైలా జంటగా నటించారు. ఈ మూవీని శివనాగేశ్వరరావు డైరెక్ట్ చేసాడు. సినిమా ఏవరేజ్ అయింది.

అక్టోబర్ 23న డాక్టర్ రాజశేఖర్ హీరోగా ఆప్తుడు మూవీ వచ్చింది. ముత్యాల సుబ్బయ్య డైరెక్ట్ చేసిన ఈ మూవీలో అంజలా జవేరి హీరోయిన్ గా చేసింది. మొదటి రెండు వారాలు మంచి కలెక్షన్స్ సాధించిన ఈ మూవీ ఏవరేజ్ గా నిల్చింది.

ఇక శంకర్ దాదా ఎంబిబిఎస్ కి మూడు వారాల గ్యాప్ తో సెప్టెంబర్ 23న ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో నితిన్ హీరోగా వచ్చిన సై మూవీ మంచి విజయాన్ని నమోదు చేసింది. జెనిలియా హీరోయిన్ గా చేసిన ఈ మూవీకి కీరవాణి మ్యూజిక్ అందించాడు.