ఛత్రపతి సినిమాకి పోటీ వచ్చిన సినిమాల పరిస్థితి…?
Tollywood Hero Prabhas Chatrapathi Movie :ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో ప్రభాస్ నటించిన ఛత్రపతి మూవీ సెన్షేషనల్ హిట్ అయింది. ఒక్కసారిగా ప్రభాస్ కి భారీ స్టార్ ఇమేజ్ వచ్చింది. శ్రేయ హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి ఎం ఎం కీరవాణి మ్యూజిక్ అలరించింది. ప్రభాస్ డైలాగ్స్, ఫైటింగ్స్ సీన్స్ ఆదరిపోయాయి.
2005సెప్టెంబర్ 30న వచ్చిన ఈ మూవీ 22కోట్ల షేర్ రాబట్టి, బ్లాక్ బస్టర్ అయిన ఈ మూవీకి పోటీగా వచ్చిన సినిమాలను చూస్తే, దీనికి రెండు వారాల ముందుగా అల్లరి బుల్లోడు మూవీ వచ్చింది. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ మూవీలో త్రిష హీరోయిన్. సంగీతం కీరవాణి. అయితే ఈ మూవీ ప్లాప్ గా నిల్చింది.
ఇక సెప్టెంబర్ 15నే డాక్టర్ రాజశేఖర్ హీరోగా వచ్చిన నాయకుడు మూవీ బిలో ఏవరేజ్ అయింది. కోడి రామకృష్ణ డైరెక్షన్ చేసిన ఈ మూవీ లో రాజశేఖర్ లుక్ ఆకట్టుకుంటుంది. సెప్టెంబర్ 22న రోహిత్ హీరోగా గుడ్ బాయ్ మూవీ వచ్చింది. జి నాగేశ్వరరావు తెరకెక్కించిన ఈ మూవీలో నవనీత్ కౌర్ హీరోయిన్. పెద్దగా ఈ మూవీ అలరించలేదు.
ఛత్రపతి కి ఒక్కరోజు ముందుగా సెప్టెంబర్ 29న మోహన్ బాబు నటించిన పొలిటికల్ రౌడీ మూవీ రిలీజయింది. ఆదినారాయణ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ఛార్మి హీరోయిన్. అయితే సినిమా అలరించలేదు.
ఛత్రపతి రిలీజ్ అయిన 5రోజుల తర్వాత బాలకృష్ణ నటించిన అల్లరి పిడుగు మూవీ వచ్చింది. బాలయ్య డబల్ రోల్ చేసిన ఈ మూవీలో కత్రినా కైఫ్, ఛార్మి నటించారు. ఈ మూవీ ని జయంత్ పరాన్జీ తెరకెక్కించగా, బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచింది. ఛత్రపతి తర్వాత రెండు వారాల గ్యాప్ తో వచ్చిన రవితేజ నటించిన భగీరథ మూవీ ఏవరేజ్ అయింది. రసూల్ ఎల్లోరా డైరెక్ట్ చేసిన ఈ మూవీలో శ్రేయ హీరోయిన్ గా చేసింది. అక్టోబర్ 12న ప్రేమిస్తే మూవీ వచ్చింది. తమిళ హీరో భరత్ నటించిన కాదల్ మూవీకి డబ్బింగ్ గా వచ్చిన ఈ మూవీ కమర్షియల్ గా మంచి విజయాన్ని అందుకుంది.

