MoviesTollywood news in telugu

శోభన్ బాబుని హైరేంజ్ లో నిలబెట్టిన 1979…ఎన్ని హిట్స్ …?

1979 Hero of the Year Shobanbabu : నటభూషణ్ శోభన్ బాబు అందగాడే కాదు. సోగ్గాడు కూడా. 1959లో దైవబలం మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి, మూడున్నర దశాబ్దాలకు పైగా నటించారు. ఎన్నో హిట్స్, బ్లాక్ బస్టర్ మూవీస్ లో నటించిన శోభన్ బాబుకి 1979 మరిచి పోలేని సంవత్సరంగా చెప్పవచ్చు.

ఆ ఏడాది 6సినిమాలు రిలీజయ్యాయి. ఎం ఎస్ రెడ్డ్డి నిర్మించిన రామబాణం మూవీ మార్చి 2న రిలీజయింది. ఇందులో శోభన్ బాబుతో పాటు కృష్ణంరాజు నటించారు. శోభన్ సరసన జయప్రద, కృష్ణంరాజు సరసన లత నటించారు. ఇది ప్లాపయింది. శోభన్ బాబు సరసన జయచిత్ర హీరోయిన్ గా చేసిన బంగారు చెల్లెలు మూవీలో శ్రీదేవి చెల్లెలుగా నటించింది.

విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ లో టి త్రివిక్రమరావు నిర్మించిన ఈ మూవీని బోయిన సుబ్బారావు తెరకెక్కించారు. మార్చి 29న వచ్చిన ఈ సినిమా హిట్ అయింది. శోభన్ బాబు ద్విపాత్రాభినయం చేసిన కార్తీకదీపం మూవీలో శారద, శ్రీదేవి, గీత ఆయన సరసన నటించారు. మే 10న రిలీజైన ఈ మూవీ ని లక్ష్మీ దీపక్ తెరకెక్కించారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిల్చింది.

జయసుధ తో కల్సి శోభన్ బాబు నటించిన జూదగాడు మూవీ ఆగస్టు 15న రిలీజయింది. వి మధుసూదనరావు డైరెక్ట్ చేసిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో మండే గుండెలు మూవీ డాక్టర్ డి రామానాయుడు నిర్మించారు. శోభన్ బాబు, కృష్ణ కల్సి నటించిన మల్టీస్టారర్ మూవీలో శోభన్ సరసన శ్రీదేవి, కృష్ణ సరసన జయప్రద నటించారు. కె బాపయ్య డైరెక్ట్ చేసిన ఈ మూవీ అక్టోబర్ 5న రిలీజయింది. సూపర్ హిట్ అయింది.

దాసరి నారాయణరావు డైరెక్షన్ లో కె మురారి నిర్మించిన గోరింటాకు సినిమాలో శోభన్ బాబు సరసన సుజాత, వక్కలంక పద్మ హీరోయిన్స్ గా నటించారు. అక్టోబర్ 19న రిలీజైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఒక్క ప్లాప్ మినహా అన్నీ హిట్ కావడంతో హీరో ఆఫ్ ద ఇయర్ గా శోభన్ బాబు నిలిచాడు. కాగా 1996లో హలొ గురు మూవీ తర్వాత యాక్టింగ్ కి గుడ్ బై చెప్పేసాడు.