Healthhealth tips in telugu

కేవలం అరగ్లాస్ – కీళ్లనొప్పులు,మోకాళ్ళనొప్పులు,అధిక బరువు,డయబెటిస్,కిడ్నీలో రాళ్ళు జీవితంలో ఉండవు

Biryani leaves health benefits In Telugu : ఈ మధ్యకాలంలో సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, వ్యాయామం చేయకపోవటం వంటి కారణాలతో అధిక బరువు సమస్య, కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వంటి అనేక రకాల సమస్యలు వస్తున్నాయి.

వీటిని తగ్గించుకోవటానికి ఆహారంలో మార్పులు చేసుకుంటూ ఇప్పుడు చెప్పే డ్రింక్ తాగితే మంచి ఔషధంగా పనిచేస్తుంది. అధిక బరువు, కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, డయాబెటిస్ వంటివి రావు

ఒక గిన్నెలో ఒక గ్లాసు నీటిని పోసి దానిలో రెండు బిర్యానీ ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి లేదా బిర్యానీ ఆకులు పొడి చేసుకుని కూడా వాడవచ్చు. పొయ్యి మీద పెట్టి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగించాలి. ఈ నీటిని వడగట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి.

ఈ నీటిని తాగడం వలన మలబద్ధకం గ్యాస్ ఎసిడిటీ సమస్యలు కూడా తొలగిపోతాయి.బిర్యానీ ఆకులు విటమిన్ ఏ, విటమిన్ సి, ఐరన్, పొటాషియం, calcium, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. బిర్యానీ ఆకులో ఉండే ఎంజైమ్స్ ప్రోటీన్స్ ను విచ్ఛిన్నం చేసి ఆహారం వేగంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. మలబద్దకం వంటి సమస్యలను తగ్గిస్తుంది.

యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉండటం వలన డయాబెటిస్ నియంత్రణలో ఉండేలా చేస్తుంది. అధిక బరువు సమస్యను తగ్గించటానికి కూడా సహాయపడుతుంది. బిరియాని ఆకు కూడా చాలా తక్కువ ధరలోనే విరివిగానే అందుబాటులో ఉంటాయి. కాబట్టి బిరియాని ఆకులతో తయారుచేసిన ఈ నీటిని తాగి ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందండి.