MoviesTollywood news in telugu

జై భీమ్ సినిమాలో నటించిన ఈ నటి గురించి కొన్ని నమ్మలేని నిజాలు

jai bhim Heroine lijomol jose : నటన అనేది ఎవరి సొత్తూ కాదు. కొందరికి పుట్టకతో వస్తే, మరికొందరికి సాధన ద్వారా, టాలెంట్ ద్వారా వస్తుంది. మహానటి సినిమాలో సావిత్రి రెండంటే రెండు కన్నీటి బొట్లు రాల్చి గ్లిసరిన్ లేకుండా నటించిన వైనం చూపించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కూడా గ్లిసరిన్ లేకుండా రియల్ గా కన్నీళ్లు తెచ్చుకుని నటించిన నటిగా లిజోమోల్ జొస్ నిల్చింది. జైభీమ్ మూవీలో చిన్నతల్లి పాత్రలో నటించిన ఈమె ఈ సినిమా చూస్తే చాలు కన్నీళ్లు వచ్చేస్తాయని చెప్పింది.

కేరళలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన లిజోమోల్ జొస్, అమెరికాలో స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో డిగ్రీ చేసింది. ఈమెకు ఓ సోదరి కూడా ఉంది. ఓ టివి ఛానల్ లో కొన్నాళ్ళు పనిచేసిన లిజోమోల్ జొస్ ఆతర్వాత పాండిచ్చేరి యూనివర్సిటీ నుంచి ఇన్ఫర్మేషన్ అండ్ లైబ్రెరీ సైన్స్ లో మాస్టర్స్ చేసింది. ఫహద్ ఫాజిల్ హీరోగా చేసిన మహేషింటే ప్రతీకారం మూవీలో తొలిచాన్స్ దక్కించుకుంది.

ఆతర్వాత రిత్విక్ రోషన్ మూవీతో లిజోమోల్ జొస్ మంచి పాపులార్టీ తెచ్చుకుంది. హానీ బి 2.5మూవీతో కెరీర్ మరోమలుపు తిరిగింది. ఒరేయ్ బామ్మర్ది మూవీలో హీరోయిన్ గా చేసింది. అయితే తాజాగా ఓటిటిలో విడుదలైన జై భీమ్ మూవీలో తన భర్త ఆచూకీ కోసం వెతికే గిరిజన మహిళ చిన్నతల్లి పాత్రతో అందరినీ మెప్పించింది. గ్లిజరిన్ లేకుండా కన్నీటి సీన్లలో నటించానని, కట్ చెప్పినా సరే, కన్నీళ్లు ఆగలేదని ఆమె చెప్పు కొచ్చింది. తమిళనాడు రిటైర్డ్ న్యాయమూర్తి చంద్రు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.