75 లక్షలతో తీసిన యమలీల ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలిస్తే షాక్…?
Ali yamaleela Movie :వందల కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్న సినిమాకు గ్యారంటీ లేని రోజుల్లో ఉన్నాం. అయితే అప్పట్లో కేవలం 75 లక్షలతో అందునా కమెడియన్ అలీ హీరోగా ఎంట్రీ ఇస్తూ తెరకెక్కించిన సినిమా ఏకంగా 12కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీని ఊపేసింది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి రూపొందించిన యమలీల రికార్డులు మామూలు రేంజ్ లో లేవు.
నిజానికి ఈ కథను మహేష్ బాబు కోసం తయారుచేయగా, చదువుకి ఇబ్బంది వస్తుందని కృష్ణ రిజెక్ట్ చేయడంతో అలీని హీరోగా పెట్టి కృష్ణారెడ్డి చేసిన ప్రయోగం అనూహ్యంగా విజయవంతమైంది. ఇందులో సూపర్ స్టార్ కృష్ణ ఓ స్పెషల్ సాంగ్ లో కన్పించి, ఆడియన్స్ కి పసందైన విందు అందించాడు.
కృష్ణ హీరోగా నెంబర్ వన్ మూవీని కృష్ణారెడ్డి డైరెక్ట్ చేసి, కృష్ణతో వెరైటీ స్టెప్పులు కూడా వేయించి, సినిమాను బ్లాక్ బస్టర్ చేసాడు. దాంతో కృష్ణారెడ్డిపై గురి కుదిరిన కృష్ణ యమలీలలో స్పెషల్ సాంగ్ లో చేసి అలరించాడు. ఇక అప్పటిదాకా కమెడియన్ గా ఉన్న అలీ స్టార్ హీరోలకు దడ పుట్టిస్తూ, తన నటనతో యమలీలలో చెలరేగిపోయాడు.

