MoviesTollywood news in telugu

ఈ ఫోటోలో కనిపిస్తున్న టాలీవుడ్ స్టార్స్ ని గుర్తు పట్టారా…?

Manchu Mohan babu Family :సెలబ్రిటీల ఫోటోలు, వారి ఫ్యామిలీ ఫోటోలు వైరల్ అయితే షేర్స్, కామెంట్స్ అదిరిపోతుంటాయి. ఇప్పుడు చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడంతో తరచూ వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు. దీంతో అభిమానులకు పండగలా ఉంటోంది. తాజాగా మంచు ఫ్యామిలీకి సంబంధించిన ఫోటో తెగ చక్కర్లు కొడుతోంది.

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయ మంచు లక్ష్మి నటిగా, యాంకర్ గా రాణిస్తూ, ఆహా ఓటిటి లో వివాహ భోజనంబు ప్రోగ్రాంతో అలరిస్తోంది. కొడుకులు మంచు విష్ణు, మనోజ్ లు హీరోలుగా ఉన్నారు. ఇందులో మంచు విష్ణు వరుస సినిమాలతో బిజీగానే ఉన్నాడు. మోహన్ బాబు సన్నాఫ్ ఇండియా మూవీతో త్వరలో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు.

అలాగే మనోజ్ అహం బ్రహ్మాస్మి మూవీతో బిజీగా ఉన్నాడు. ఇక విష్ణు తాజాగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా ఎన్నికయ్యాడు. అయితే అతడు నటించిన మోసగాళ్లు మూవీ ఇటీవల రిలీజై, నిరాశ పరిచింది. ప్రస్తుతం మంచు లక్ష్మితో పాటు, విష్ణు, మనోజ్ లతో కూడిన చిన్నప్పటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."