MoviesTollywood news in telugu

అనసూయ కెరీర్ లో బిన్నమైన పాత్రలు…ఒక లుక్ వేయండి

Anasuya Bharadwaj Movies : యాంకర్ గా బుల్లితెర ఆడియన్స్ లో మదిని దోచిన అనసూయ 36 ఏళ్ల వయసులో కూడా అదిరిపోయే ఫిజిక్‌తో అదరగొడుతోంది. అనసూయ భరద్వాజ్ పేరుచెబితే, ముందుగా గ్లామర్ క్వీన్ గుర్తుకొస్తుంది. జబర్దస్త్ కామెడీ షోతో క్లిక్ అయిన ఈమె సినిమాల్లో సైతం తన సత్తా చాటుతోంది.

ఇప్పుడు సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప మూవీలో దాక్షాయణిగా సీమ యాసలో అనసూయ అదరగొట్టబోతోంది. ఈ పాత్ర కోసం అనసూయ తనను తాను మౌల్డ్ చేసుకుందని తెలుస్తోంది. ఇక సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన రంగస్థలం మూవీ లో రంగమ్మత్త పాత్ర అనసూయ కెరీర్‌లో మరపురానిది.

ఇక నెగిటివ్ రోల్స్ లో సైతం అనసూయ అదరగొట్టేసింది. అందుకు క్షణం మూవీలో అనసూయ నటన తార్కాణం. ‘కథనం’ సినిమా డిజాస్టర్ గా ఎంగిలినప్పటికీ ఇందులో అనసూయ క్యారెక్టర్ అదుర్స్ అనే చెప్పాలి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన యాత్ర మూవీలో కనిపించేది ఒక్క సన్నివేశమే అయినా కూడా సుచరిత రెడ్డి పాత్రకు అనసూయ ప్రాణం పోసింది. అలాగే ఎఫ్ 2 సినిమాలో కూడా 10 నిమిషాల పాత్రలో అయినా అనసూయ గుర్తుండిపోయే పాత్ర చేసింది.

మీకు మాత్రమే చెప్తా’ మూవీలో భిన్నమైన పాత్రలో నటించి, డిఫరెంట్ స్క్రిప్టులు సెలెక్ట్ చేసుకుంటుందని చాటింది. మోహన్ బాబు హీరోగా నటించిన గాయత్రి సినిమాలో అనసూయ జర్నలిస్టుగా నటించి మెప్పించింది. ఇక ‘థ్యాంక్ యూ బ్రదర్’ మూవీలో ఓ లిఫ్టులో ఇరుక్కుపోయి ప్రసవం కోసం నరకయాతన పడే గృహిణి పాత్రలో అనసూయ నటన అద్భుతం. అందుకే ఈ సినిమా ఫ్లాప్ అయినా..ఆమె నటన ఆకట్టుకుంది.