MoviesTollywood news in telugu

జనతా గ్యారేజ్ సినిమాకి పోటీ వచ్చి ఓడిన సినిమాలు ఎన్నో…?

Janatha Garage Movie : కొరటాల శివ డైరెక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, మలయాళ సీనియర్ స్టార్ హీరో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన జనతా గ్యారేజ్ కమర్షియల్ గా ఘనవిజయాన్ని అందుకుంది. పాత మోటారు బైక్స్, వాహనాలను జారీచేయడంతో పాటు మనుషుల్లో కుళ్ళును కూడా తొలగించే పాత్రలో మోహన్ లాల్, ప్రకృతిలో కాలుష్యాన్ని అరికట్టడానికి ఎలాంటి ఇబ్బందులనైనా అధిగమించే పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ అదరగొట్టేసారు.

సమంత హీరోయిన్ గా నటించగా, నిత్యా మీనన్ ఓ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అదనపు ఆకర్షణ. 2016 సెప్టెంబర్ 1న రిలీజై, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. 130కోట్లు కలెక్ట్ చేసింది. దీనికి రెండు వారాల ముందు ఆగస్టు 19న చుట్టాలబ్బాయి మూవీ వచ్చింది. ఆది సాయికుమార్ హీరోగా చేసిన ఈ మూవీ ఏవరేజ్ అయింది. డైరెక్టర్ వీరభద్రం చౌదరి తెరకెక్కించాడు.

ఆగస్టు 19నే సుశాంత్ హీరోగా నటించిన ఆటాడుకుందాం రా మూవీ రిలీజయింది. జి నాగేశ్వర రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ మూవీ పరాజయం పాలైంది. ఆగస్టు 26న తమిళ డబ్బింగ్ మూవీ తొలిప్రేమలో రిలీజయింది. అయితే పెద్దగా ఆకట్టుకోలేదు. సుడిగాలి సుధీర్, దీక్షా, ధనరాజ్, షకలక శంకర్ తదితరులు నటించిన బంతిపూల జానకి మూవీ వచ్చింది. కామెడీ, థ్రిల్లర్ మేళవించిన ఈ మూవీ నిరాశ పరిచింది.

అదేరోజు అవసరానికి అబద్ధం మూవీ రిలీజయింది. ఇదీ ప్లాప్ అయింది. నందమూరి తారకరత్న నటించిన ఎవరు మూవీ కూడా నిరాశ పరిచింది. పరిశోధన క్రమంలో సాగే ఈ సినిమాకు వెంకట రమణ సెల్వ డైరెక్షన్ చేసాడు. దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ నటించిన 100డేస్ తమిళ రీమేక్ మూవీ ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా వచ్చినప్పటికీ ఆకట్టుకోలేకపోయింది.

సెప్టెంబర్ 8న విక్రమ్, నయనతార జంటగా నటించిన ఇంకొక్కడు మూవీ రిలీజయింది. హీరో, విలన్ ఇలా రెండు పాత్రలూ విక్రమ్ చేయడం బాగున్నా సినిమా ఏవరేజ్ అయింది. సెప్టెంబర్ 9న నారా రోహిత్, నాగశౌర్య హీరోలుగా వచ్చిన జ్యో అచ్యుతానంద మూవీ మంచి ఆదరణ చూరగొంది.

శ్రీనివాస్ అవసరాల డైరెక్ట్ చేసాడు. అదేరోజు శ్రీకాంత్ హీరోగా మెంటల్ పోలీస్ మూవీ వచ్చింది. అయితే ఇది ఫెయిల్యూర్ గా నిల్చింది. సెప్టెంబర్ 16న శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నిర్మలా కాన్వెంట్ మూవీ వచ్చింది. ఇదీ పరాజయం పాలైంది. కింగ్ నాగార్జున నిర్మించి, ఓ పాత్ర కూడా చేసాడు.