Healthhealth tips in telugu

గట్టిగా వాసన పీల్చితే చాలు నిద్ర రాని వారికి కూడా గాఢ నిద్ర వచ్చేస్తుంది

Poppy seeds in Telugu :ఈ రోజుల్లో నిద్రలేమి సమస్య అనేది చిన్న పిల్లల దగ్గరి నుండి పెద్దవారి వరకు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను తేలిగ్గా వదిలేస్తే ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది. మంచం మీద ఎంత సేపు దొర్లిన ఎంతసేపు కళ్ళు మూసుకున్నా నిద్ర అనేది అస్సలు రాదు. నిద్రలేమి సమస్య రావటానికి ఒత్తిడి మానసిక ఆందోళన వంటి సమస్యలుమరియు కొన్ని రకాల మందులు వాడటం వంటివి కారణాలుగా చెప్పవచ్చు.

ఈ సమస్య పరిష్కారానికి గసగసాలు బాగా సహాయపడతాయి. గసగసాలను దోరగా వెగించి ఒక పలుచని వస్త్రంలో వేసి మూట కట్టి వాసన పీల్చితే మంచి నిద్ర పడుతుంది. అలాగే అరగ్లాస్ పాలల్లో అరస్పూన్ గసగసాలను మరిగించి రాత్రి పడుకోవటానికి అరగంట ముందు తాగిన మంచి నిద్ర పడుతుంది.

ప్రతి ఇంటిలో దాదాపుగా గసగసాలు ఉంటాయి. మసాలా వంటల్లో వాడతారు. నిద్రలేమి సమస్య పరిష్కారానికి గసగసాలు ఎంతగానో సహాయపడతాయి. మన వంటింటిలో ఉండే చాలా వస్తువులు మనకు ఎన్నో ఆరోఘ్య ప్రయోజనాలను అందిస్తాయి. వంటిల్లును ఒక ఔషదాల గని అని చెప్పవచ్చు.