సినిమా కోసం కష్టపడుతున్నఈ అందాల భామను గుర్తు పట్టారా…?

Tollywood Heroine nivetha thomas : నివేదా థామస్, అనగానే నాని నటించిన జెంటిల్ మెన్ సినిమా గుర్తొస్తుంది. ఆ మూవీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నివేద అందం అభినయంతో వరుస సినిమాలతో అలరిస్తోంది. ముఖ్యంగా స్పీడ్ గా దూసుకుపోవడం కాకుండా, నెమ్మదిగా సినిమాలు చేస్తోంది. తెలుగుతో పాటు తమిళ్ లో కూడా సినిమాలు చేసింది.

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన దర్బార్ సినిమాలో ఆయన కూతురుగా మెరిసింది. తాజాగా ఓ సినిమా కోసం నివేద కఠోరంగా శ్రమిస్తున్న ఓ వీడియోవైరల్ అవుతోంది.అలాగే మరో బ్యూటీ రెజీనా కెరీర్ బిగినింగ్‌లో తెలుగులో వరుస సినిమాలు చేసి ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు నెమ్మదించినప్పటికీ తమిళ మూవీస్ లో మాత్రం మంచి ఛాన్స్ లు దక్కించుకుంటోంది.

ఈ ముద్దుగుమ్మ నటించిన నేనేనా అనే హారర్ మూవీ రిలీజ్‌కు రెడీగా ఉంది. అయితే నివేదా, రెజీనా .. ఈ ఇద్దరు బ్యూటీలు కలిసి శాకిని డాకిని మూవీ చేస్తున్నారు. ఓ బేబీ వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ కాంబినేషన్‌లో డి. సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్ వ్యూ థామస్ కిమ్ సంయుక్తంగా నిర్మిస్తున్న శాకిని డాకిని చిత్రాన్ని డైరెక్టర్ సుధీర్ వర్మ తెరకెక్కి స్తున్నాడు. ఈ సినిమా ఫైట్ సీన్స్ కోసం నివేద ప్రాక్టీస్ చేస్తూ కనిపిస్తున్న వీడియో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ కోసం కొన్ని రోజులుగా ప్రిపరేషన్‌లో ఉన్నామని, ప్రస్తుతం ట్రైనింగ్ జరుగుతోందని నివేదా వెల్లడించింది.