తారక్ కి నచ్చిన పవన్ సినిమా ఏంటో తెలుసా ?

Tollywood Hero Ntr : ఫాన్స్ మధ్య పోటీ ఉంటుందే తప్ప హీరోల మధ్య నిజమైన పోటీ ఉండదు. అందరూ కల్సి వుంటారు. ఒకరంటే ఒకరికి ఆప్యాయత అనురాగం ఉంటాయి. హిట్స్, ప్లాప్స్ వచ్చినపుడు షేర్ చేసుకుంటారు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో జూనియర్ ఎన్టీఆర్ కి బాగా ఇష్టమైన ఒక సినిమా ఉందట.

ఈ మధ్య ఈ విషయం బాగా వైరల్ అవుతోంది. ఇటీవల ఒక షో సందర్బంగా పవన్ సినిమాల్లో మీకేది ఇష్టమని అడిగితె తారక్ వెంటనే తొలిప్రేమ అని చెప్పాడు. ఇది నెట్టింట చక్కర్లు కొడుతోంది. పవన్ ఫాన్స్ కి కూడా బాగా నచ్చిన సినిమా ఇది. అందుకే ఈ జవాబు పవన్ ఫాన్స్, తారక్ ఫాన్స్ కి కూడా నచ్చేసింది.

ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్ తో కల్సి ఆర్ ఆర్ ఆర్ మల్టీస్టారర్ మూవీ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ తర్వాత కొరటాల శివ డైరెక్షన్ లో భారీ సినిమా చేయబోతున్నాడు. అయితే ఈమధ్య జెమిని టివిలో మీలో ఎవరు కోటీశ్వరులు షో చేస్తున్నాడు.ఈ షో జనాన్ని బాగానే ఆకట్టుకుంటోంది. ఇందులో సెలబ్రిటీలను కూడా అప్పుడప్పుడు పిలిచి ఆడిస్తున్నాడు. ఆ సందర్బంగా వచ్చిన ప్రశ్న ,జవాబు చక్కర్లు కొడుతోంది.