నెంబర్ వన్ సినిమాకి పోటీ వచ్చి ఓడిన సినిమాలు ఎన్ని…?

Krishna Number One Movie :ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లో సూపర్ స్టార్ కృష్ణ, సౌందర్య జంటగా తెరకెక్కించిన నెంబర్ వన్ మూవీ అప్పట్లో సెన్షేషనల్ హిట్. అప్పటివరకూ కృష్ణను ఒక లెక్కన చూస్తే, ఈ సినిమాతో మరోలెక్క అన్నట్టుగా విభిన్న గెటప్, స్టెప్స్ తో అదరగొట్టేసారు. 1994 జనవరి14న సంక్రాంతి స్పెషల్ గా వచ్చిన ఈ మూవీ కృష్ణ కెరీర్ లో మరపురాని మూవీగా నిల్చింది. కృష్ణకు బ్లాక్ బస్టర్ ఇచ్చింది. పలు కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకున్న ఈ మూవీ ఆరుకోట్ల షేర్ రాబట్టింది.

ఇక అదేరోజు డాక్టర్ రాజశేఖర్ హీరోగా అంగరక్షకుడు మూవీ వచ్చింది. మీనా నటించిన ఈ మూవీకి కీరవాణి మ్యూజిక్ బాగుంది. కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టిన ఈ మూవీ ఏవరేజ్ తో నడిచింది. జనవరి 7న మెగాస్టార్ చిరంజీవి త్రిపాత్రాభినయం చేసిన ముగ్గురు మొనగాళ్లు మూవీ వచ్చింది. కె రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ మూవీ కలెక్షన్స్ పరంగా దుమ్మురేపింది. అయితే ఈ మూవీ ఏవరేజ్ గా నిల్చింది.

నెంబర్ వన్ కి 13రోజుల ముందుగా దాసరి నారాయణరావు, వినోద్ కుమార్ నటించిన ఓ తండ్రి ఓ కొడుకు మూవీ వచ్చింది. మౌళి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఏవరేజ్ అయింది. కింగ్ నాగార్జున నటించిన గోవిందా గోవిందా మూవీ జనవరి 21న రిలీజయింది. రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ మూవీ లో శ్రీదేవి హీరోయిన్ గా నటించింది. అయితే ఈ మూవీ పరాజయం పాలైంది.