MoviesTollywood news in telugu

2013 సంక్రాంతి సినిమాల్లో విజేత ఎవరో తెలుసా ?

2013 Sankranthi Telugu Movies Result : పండగ వస్తే సినిమాల సందడి సహజం. అందునా సంక్రాంతికి సినిమాల జోరు చెప్పక్కర్లేదు. అగ్ర హీరోలతో పాటు చిన్న హీరోలు కూడా పోటీపడతారు. అందులో విజేత ఎవరో ఆడియన్స్ తేలుస్తారు. 2013 సంక్రాంతి వేళ విడుదలైన సినిమాల విషయానికి వస్తే, 3పెద్ద సినిమాలు , రెండు చిన్న సినిమాలు వచ్చాయి.

జనవరి 9న రామ్ చరణ్ నటించిన వివి వినాయక్ తెరకెక్కించిన నాయక్ మూవీ రిలీజయింది.రామ్ చరణ్ డబుల్ రోల్ చేయగా, కాజల్, అమలాపాల్ జోడీ కట్టారు. లవ్, కామెడీ ప్రధానంగా సాగిన నాయక్ సంక్రాంతి మసాలా మూవీగా నిల్చింది. థమన్ మ్యూజిక్ చెర్రీ డాన్స్ లు కుదిరాయి. 35కోట్లతో తెరకెక్కి 46కోట్లు కలెక్ట్ చేసింది.

విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన, శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన మల్టీస్టారర్ మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ జనవరి 11న భారీ అంచనాలతో రిలీజయింది. సమంత, అంజలి హీరోయిన్స్ గా చేసారు. జయసుధ, ప్రకాష్ రాజ్ వంటి నటులు ప్రాధాన్యత గల పాత్రల్లో మెప్పించారు.

ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయిన ఈ మూవీ మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. 50కోట్లతో తీసిన ఈ మూవీ 51కోట్లు వసూళ్లు రాబట్టి, టాప్ గ్రాసర్ లో సెకండ్ ప్లేస్ తెచ్చుకుంది. ఈ రెండు సినిమాలకు వారం ముందుగా శ్రీకాంత్ నటించిన సేవకుడు మూవీ వచ్చింది. వి సముద్ర డైరెక్ట్ చేసిన ఈ మూవీ పరాజయం పాలైంది.

ఇదే రోజున 7రోజుల్లో మూవీ రిలీజయింది. ఉమాకాంత్ డైరెక్షన్ లో కొత్త నటులతో తీసిన ఈ మూవీ నిరాశ పరిచింది. దీంతో నాయక్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీస్ బాక్సాఫీస్ దగ్గర విన్నర్ గా నిలిచాయి