MoviesTollywood news in telugu

లక్ష్య మూవీ కోసం నాగ శౌర్య ఏం చేసాడో తెలుసా…అసలు నమ్మలేరు

Naga shourya Lakshya Movie : డైరెక్షన్ కూడా చేయగల యంగ్ హీరో నాగ శౌర్య తాజాగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో సంతోష్ జాగర్లపూడి తెరకెక్కిస్తున్న లక్ష్య మూవీలో నటిస్తున్నాడు. ఇటీవల ఈ మూవీ ట్రైలర్‌ను విక్ట‌రి వెంక‌టేష్ విడుద‌ల‌ చేసి టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్ కూడా చెప్పాడు. లక్ష్య చిత్రం డిసెంబర్ 10న విడుదల కానుంది.

వరుస పరాజయాలు చూసిన శౌర్య ఈ మూవీ కోసం ఎంతో కష్టపడ్డాడు. సినిమాలో 8 ప్యాక్ తో కనిపించబోతున్నాడు. 8 ప్యాక్ కోసం మూడు రోజులు కనీసం పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు. కనీసం ఆయన ఉమ్ము కూడా మింగలేదు. 8 ప్యాక్ కోసం మూడు రోజులు అలానే ఉండిపోయాడట శౌర్య.

ఆర్చరీ మీద తీస్తున్న మొదటి సినిమా ఇది. ఎన్నో ప్రాచీన విద్యలు మరుగున పడుతున్నాయి. బుద్దిజం మన వద్దే పుట్టింది. కానీ వేరే దేశాల్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఉందనేది కూడా తెలియడం లేదు.

మనం దేవుళ్లుగా కొలిచే వారి చేతిలో, వీరులుగా చెప్పుకునే వారి చేతిలో విల్లును చూస్తాం. ఇది అంత గొప్పది. అన్నింటిని ఆటలు అంటాం. కానీ ఆర్చరీని మాత్రం విలు విద్య అని అంటాం అని దర్శకుడు సంతోష్ చెప్పుకొచ్చాడు. తాను కథను రాసుకున్నప్పుడు, నన్ను నమ్మి ప్రొడ్యూసర్స్ ఛాన్స్ ఇచ్చారు.

నేను రాసుకున్నది నలభై శాతం అయితే..నాగ శౌర్య వంద శాతాన్ని చేసాడు. అతడు లేకుంటే ఈ సినిమా ఇంత బాగా వచ్చేది కాదు అని సంతోష్ చెప్పాడు. ఇక లక్ష్య మూవీలో రొమాంటిక్ హీరోయిన్ కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రయివేట్ లిమిటెడ్ బ్యానర్లపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.