MoviesTollywood news in telugu

బీమ్లా నాయక్ లో రానాతో జోడీ కట్టిన భామ ఎవరో తెలుసా ?

Bheemla nayak Heroine samyuktha menon : మలయాళ వర్షన్ ‘అయ్యపనుమ్ కోషియుమ్’కి రీమేక్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతూన్న భీమ్లా నాయక్ మూవీ సంక్రాంతికి రిలీజ్ కానుంది. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. తమ అభిమాన హీరోను రఫ్ అండ్ టఫ్ పోలీస్ ఆఫీసర్ ‘భీమ్లా నాయక్’గా ఎప్పుడెప్పుడు చూద్దామా తెగ ఆరాటపడుతున్నారు.

హీరోల భార్యలకు ఎక్కువ ప్రాధాన్యత ఉండేలా రైటర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగు వెర్షన్‌లో కథలో మార్పులు చేశారు. ఇక పవన్ కళ్యాణ్ భార్యగా నిత్యామీనన్‌ను సెలెక్ట్ చేసారు. ఈమూవీలో వపన్‌తో పాటు నటిస్తున్న రానాకు భార్యగా ఎవరు నటిస్తారనే దానిపై పెద్ద చర్చ నడిచింది. తాజాగా ఈ సినిమా నుండి అడవి తల్లి మాట సాంగ్ రిలీజ్ కావడంతో బాగా జనంలోకి దూసుకెళ్తోంది.

ఇక ఈ పాటలో తళుక్కున మెరిసిన మలయాళ కుట్టి సంయుక్త మీనన్ ఎవరా అంటూ ఆడియన్స్ ఆరా తీశారు. ఆ భామ ఎవరో కాదు, నిత్యా మీనన్‌ లాగానే సంయుక్త మీనన్‌ కూడా మలయాళ భామ. 2016లో పాప్‌కార్న్ మలయాళ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సంయుక్త మీనన్ ఇప్పుడిప్పుడే తమిళ, మలయాళ ఇండస్ట్రీల్లో హీరోయిన్‌గా రాణిస్తోంది.

అయితే తమిళంలో ఒకట్రెండు మూవీస్ చేసినా వర్కవుట్ కాలేదు. దాంతో మలయాళ సినిమాల్లోకి వచ్చి బిజీగా మారింది. ఇదే సమయంలో సంయుక్తకు టాలీవుడ్ లో ఛాన్స్ వచ్చింది. మరోపక్క కోలీవుడ్ లో ఛాన్స్ ఇవ్వడానికి రెడీ ఉన్నారట.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."