MoviesTollywood news in telugu

‘అఖండ”లో విలన్ బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసా ?

akhanda villain nitin mehta Facts : రామ్ చరణ్ తో వినయ విధేయ రామ మూవీ డిజాస్టర్ తర్వాత డైరెక్టర్ బోయపాటి శ్రీను కసిగా నందమూరి నటసింహం బాలకృష్ణతో తీసిన అఖండ మూవీ థియేటర్స్ లో ఫాన్స్ కి పండగ వాతావరణం తెచ్చింది. అందుకే ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా అఖండ టాపిక్ నడుస్తోంది. గతంలో బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో సింహా, లెజెండ్ మూవీస్ బ్లాక్ బస్టర్ అయ్యాయి.

ఇక అఖండ హిట్ తో హ్యాట్రిక్ కొట్టారు. ఈ మూవీలో ఇక శ్రీకాంత్‌తో పాటు మరో విలన్‌గా నితిన్ మెహ‌తా నటించారు. ఎందుకంటే, బోయపాటి సినిమాల్లో హీరో క్యారెక్టర్ కి ధీటుగా విలన్ పాత్రలు పవర్‌ఫుల్‌గా, బలంగా డిజైన్ చేస్తారు. ఈ మూవీ ఊహించిన దానికంటే ఎక్కువగానే ఆడియన్స్ ని ఆశ్చర్యపరిచింది.

అలాగే అఖండలో కూడా బాలయ్యను ఢీ కొట్టే విలన్ పాత్రలో శ్రీకాంత్‌ను పెట్టి, శ్రీకాంత్ క్యారెక్టరైజెషన్, విలనిజం డిఫరెంట్‌గా తీర్చిదిద్దాడు. ఇక ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అఖండలో గ‌జేంద్ర సాహు పాత్రతో నితిన్ మెహతా టాక్ ఆఫ్ ది టౌన్‌గా కావడంతో విలన్‌గా నితిన్‌కు టాలీవుడ్‌లో మరికొన్ని ఛాన్సులు దక్కుతాయని అంచనా.

ఆర్మీ నుండి ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీ అనగానే తన తండ్రి ఒప్పుకోక పోవడంతో ఎలాగోలా ఒప్పించి మోడల్‌గా కెరీర్‌ స్టార్ట్ చేసారు. మోడల్‌గా నితిన్ పోర్ట్‌ఫోలియో చూసి ఒక పెద్ద సంస్థ తనకు ప్రొఫెషనల్ మోడల్‌గా ఛాన్స్ ఇచ్చింది. 44 ఏళ్ల వయసులో 88 కేజీల బరువుతో ఆయన మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించారు.

కానీ కొద్దికాలంలోనే ఫిట్‌గా తయారయ్యి అందరినీ ఆశ్చర్యపరిచారు. సినిమాలకంటే ముందు అక్షయ్ కుమార్‌తో కలిసి ప్రైవేట్ సాంగ్స్‌లో నితిన్ నటించారు. గడ్డంతో హ్యాండ్‌సమ్ కనిపించే నన్ను ఎయిర్‌ పోర్ట్‌లో చూసి, సినిమా ఆఫర్ ఇచ్చాడు. అఖండ విజయంపై నితిన్ ఖుషీగా ఉన్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."