MoviesTollywood news in telugu

ఈ ఫోటోలో చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయిన్…ఎవరో గుర్తు పట్టారా…?

Tollywood Heroine payal rajput :సాంకేతికంగా వచ్చిన మార్పులతో పలు రకాలుగా సోషల్ మీడియా దూసుకెళ్తోంది. దీంతో పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. దీంతో ఏ చిన్న సంఘటన జరిగినా సరే, హీరో, హీరోయిన్ల ఫోటోలు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసేస్తున్నారు. ముఖ్యంగా చిన్ననాటి ఫోటోలు షేర్ చేయడంతో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఓ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో చక్కర్లు కొడుతోంది.

ఆమె ఎవరో కాదు, ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్‌పుత్. ఈ బ్యూటీకి చెందిన ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఆర్ ఎక్స్ 100మూవీతో బెస్ట్ ఫిమేల్ డెబ్యూ యాక్టరస్‌గా సైమా అవార్డు సొంతం చేసుకుంది. ప్రస్తుతం పాయల్ రాజ్‌పుత్ ప్రస్తుతం తమిళ, పంజాబీ, కన్నడ, తెలుగు భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తోంది.

అయితే ఆర్ ఎక్స్ 100 సినిమాతో మొదటి సినిమాతోనే అబ్బాయిల్లో పిచ్చ ఫాలోయింగ్ సంపాదించింది. తర్వాత ఆమె నటించిన ఆర్డీఎక్స్ లవ్… , వెంకీ మామ… , డిస్కో రాజా… మూవీస్. ఇక సోషల్ మీడియాలో రెండు పిలకలతో ఫోటోకి పోజిస్తున్న చిన్ననాటి ఫోటోని పోస్ట్ చేయడంతో ఫాన్స్ ఫిదా అవుతున్నారు. తెగ వైరల్ చేస్తున్నారు.