MoviesTollywood news in telugu

“జగదేక వీరుడు అతిలోక సుందరి”కి పోటీగా వచ్చిన సినిమాల పరిస్థితి…?

jagadeka Veerudu Athiloka Sundari Movie :మెగాస్టార్ చిరంజీవి, అందాల తార శ్రీదేవి జంటగా నటించడంతో పాటు దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్. పాటలన్నీ హిట్. నటన, స్టెప్స్, ఫైట్స్ అన్నీ వినూత్నంగానే ఉంటాయి. ఇళయరాజా బాణీలు ఇప్పటికీ కొత్తదనంగానే ఉంటాయి. మాంత్రికుడిగా అమ్రిష్ పురి నటన ప్రత్యేక ఆకర్షణ.

సి అశ్వినీదత్ నిర్మించిన ఈ భారీ చిత్రం 1990 మే 9న రిలీజయింది. అప్పుడు ప్రకృతి వైపరీత్యాలు నెలకొన్నాయి. అయినా ఈసినిమా దూకుడు సాగింది. 29సెంటర్స్ లో 100డేస్, కొన్ని సెంటర్స్ లో 200రోజులు ఆడింది. 6కోట్ల షేర్ రాబట్టి ఇండస్ట్రీ హిట్ అయింది. ఏప్రియల్ 25న సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఆయుధం మూవీ వచ్చింది. రమేష్ బాబు కూడా ఇందులో నటించాడు. కె మురళీమోహనరావు డైరెక్ట్ చేసిన ఈ మూవీ నిరాశ పరిచింది.

ఏప్రియల్ 27న బాలకృష్ణ నటించిన నారీ నారీ నడుమ మురారి మూవీ వచ్చింది. శోభన, నిరోషా హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీలో శారద కీలక పాత్ర పోషించింది. ఏ కోదండ రామిరెడ్డి డైరెక్షన్ లో అసలు ఫైట్స్ లేకుండా క్లాసిక్ మూవీగా వచ్చి, ఆడియన్స్ ఆదరణ చూరగొంది. కెవి మహదేవన్ మ్యూజిక్ ఈ మూవీకి ప్రధాన ఆకర్షణ అయింది.

ఏప్రియల్ 30న మామ అల్లుడు మూవీ రిలీజయింది. రేలంగి నరసింహారావు డైరెక్షన్ లో దాసరి నారాయణరావు, రాజేంద్రప్రసాద్ నటించిన ఈ మూవీలో వాణీ విశ్వనాధ్ హీరోయిన్. అయితే ఈ సినిమా వచ్చిన టైం బాగోక పోవడంతో కొంత నిరాశ మిగిల్చింది. ఇక జయప్రద ప్రధాన పాత్రలో నరేష్ నటించిన జస్టిస్ రుద్రమదేవి మూవీ కూడా నిరాశ పరిచింది. రంగారావు కుర్రా డైరెక్ట్ చేసాడు. మొత్తంగా జగదేక వీరుడు అతిలోక సుందరి నెంబర్ వన్ స్థానంలో ఉండగా, నారీ నారీ నడుమ మురారి సెకండ్ ప్లేస్ లో నిలబడింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."