MoviesTollywood news in telugu

టాలీవుడ్ విలన్ల రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాలసిందే

Tollywood villains remunerations : హీరోగా ధీటుగా విలనిజం పండించే నటులకు దర్శక నిర్మాతలు చేస్తున్న వేటలో విలన్ పాత్ర కోసం ఎంత సొమ్ము అయినా రెమ్యునరేషన్ గా ఇవ్వడానికి వెనుకాడడం లేదు. అందుకే పాత్రకు గుర్తింపుతో పాటు అధిక రెమ్యునరేషన్ కూడా వస్తున్న నేపథ్యంలో కొందరు హీరోలు సైతం విలన్లుగా అవతారం ఎత్తి బాగానే గడిస్తున్నారు. మరోపక్క బాలీవుడ్, కోలీవుడ్, అలాగే ఇతర భాషా చిత్రాల నుంచి కూడా విలన్లను దిగుమతి చేసుకుంటున్నారు.

బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ గా చేయడానికి ఏకంగా మూడు కోట్లు రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు టాక్. అలాగే సోనూసూద్, సుదీప్ కూడా మూడు కోట్ల వరకూ అందుకుంటున్నాడు. నీల్ నితిన్ ముఖేష్ కూడా రెండు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని చెబుతున్నారు.

బాలకృష్ణ నటించిన నటించిన లెజెండ్ మూవీలో విలన్ గా నటించిన ఒకప్పటి ఫ్యామిలీ హీరో జగపతి బాబు విలన్ వేషాలు వేయడానికి ఒక్కో సినిమాకు కోటిన్నర రూపాయల వరకూ అందుకుంటున్నట్లు టాక్. ప్రకాష్ రాజ్ రోజుకి 10 లక్షల చొప్పున మూవీకి కోటిన్నర వరకూ అందుకున్నాడు. తాజాగా బాలయ్య నటించిన అఖండ మూవీతో హీరో శ్రీకాంత్ విలన్ అయ్యాడు. ఇందుకోసం కోటి రూపాయలకు పైనే రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది.

బోయపాటి శ్రీను తెరకెక్కించిన అఖండ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో బాలయ్యతో పాటు శ్రీకాంత్ కి కూడా మంచి పేరే వచ్చింది. ఆది పినిశెట్టి కోటి రూపాయలకు పైనే అందుకుంటున్నాడు. సాయికుమార్ 50లక్షలు, సంపత్ రాజ్ 40లక్షలు, రవికిషన్ 40లక్షలు, హరీష్ ఉత్తమన్ 30లక్షలు చొప్పున తీసుకుంటున్నారని టాక్.