Healthhealth tips in telugu

7 రోజులు – మోకాళ్ళ నొప్పులు,కీళ్ల నొప్పులు,నడుము నొప్పి,శారీరక బలహీనత,కాల్షియం లోపం అనేవి ఉండవు

Joint Pains Home Remedies In Telugu : కొంచెం పని చేసినా త్వరగా అలసిపోవడం, ఎముకలు పేలుసుగా మారటం, కీళ్లలో నొప్పులు ఉండటం, కూర్చుని లేవటం కష్టం అవటం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. శీతాకాలంలో నొప్పులు అనేవి సాధారణంగా ఎక్కువగా ఉంటాయి. శీతాకాలంలో వచ్చే నడుం నొప్పి, భుజాల నొప్పులు మోకాళ్ళ నొప్పులు కారణంగా రోజువారి పనులు కష్టం అవుతాయి.
gasagasalu uses
కొంతమంది పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ ఉంటారు. ఎముకలు బలహీనంగా మారటానికి calcium, విటమిన్ డి లోపం కారణంగా నొప్పులు ఉంటాయి. సాధారణంగా 35 సంవత్సరాల వయసు దాటిన మహిళల్లో ఈ లోపం కనబడుతుంది. కాల్షియం లోపం లేకుండా చూసుకోవాలి.ఇప్పుడు చెప్పే ఈ పాలను తాగితే శారీరక బలహీనత తొలగిపోతుంది. కాల్షియం సప్లిమెంట్ జోలికి వెళ్లాల్సిన అవసరం ఉండదు.

దీని కోసం పొయ్యి మీద పాన్ పెట్టి 6 బాదం పప్పులు,12 ఫుల్ మఖాన, పావుస్పూన్ మెంతులు, ఒక స్పూన్ గసగసాలు, పావుస్పూన్ పసుపు, పావు స్పూన్ శొంఠి, ఒక ఇంచు దాల్చిన చెక్క ముక్క వేసి సిమ్ లో పెట్టి వెగించి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడి 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది.

ఒక గ్లాస్ గోరువెచ్చని పాలల్లో అరస్పూన్ పొడి కలిపి ఉదయం లేదా సాయంత్రం తాగితే సరిపోతుంది. ఈ పాలను తీసుకోవటానికి ముందు పొట్ట అరగంట ఖాళీగా ఉంటే మంచిది. వారం రోజులు తాగి రెండు రోజులు గ్యాప్ ఇచ్చి మరల వారం రోజులు తాగాలి. ఈ విధంగా తాగుతూ ఉంటే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. శారీరక బలహీనత తొలగిపోతుంది.