Healthhealth tips in telugu

1 సారి – 100 ఏళ్ళు వచ్చిన కీళ్ల నొప్పులు,బలహీనత,రక్త హీనత, కాల్షియం లోపం ఉండవు

Jaggery and peanuts Benefits In telugu : వేరుశనగల్లో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే బెల్లంలో కూడా ఎన్నో పోషకాలు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని విడివిడిగా తీసుకోవటం కన్నా రెండింటినీ కలిపి తీసుకుంటే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. ఇప్పుడు కాలం మారి వేడి వాతావరణం నుండి చల్లని వాతావరణంలోకి వచ్చింది.
Jaggery Health Benefits in Telugu
ఈ సమయంలో వేరుశనగ,బెల్లం కలిపి తింటే శరీరం చల్లగా మారకుండా వేడిగా ఉంటుంది. అంటే శరీరానికి అవసరమైన వేడి ఉండేలా చేస్తుంది. రక్తప్రసరణ బాగా జరిగి రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కొలస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. దాంతో గుండెకు సంబందించిన సమస్యలు రాకుండా ఉంటాయి. వేరుశనగలో సెలీనియం, బెల్లంలో మెగ్నీషియం మరియు ఇనుము సమృద్ధిగా ఉంటాయి.

ఇవి సంతానోత్పత్తి సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాకుండా కండరాలను బలోపేతం చేస్తుంది. రక్తహీనత సమస్య ఉన్నవారికి చాలా హెల్ప్ చేస్తుంది. బెల్లంలో ఇనుము పుష్కలంగా ఉండటం వలన రక్తహీనత నుండి రక్షిస్తుంది. వేరుశనగలో కాల్షియం సమృద్ధిగా ఉండుట వలన ఎముకలను బలంగా మరియు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.

నీరసం,అలసట,నిసత్తువగా ఉన్నప్పుడు వీటిని తింటే తక్షణ శక్తి లభించి ఉషారుగా ఉంటారు. కాల్షియం లోపం లేకుండా చేస్తుంది. శరీరంలో బలహీనత లేకుండా బలంగా ఉండేలా చేస్తుంది. ఒక స్పూన్ వేరుశనగలను రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం చిన్న బెల్లం ముక్కతో కలిపి తీసుకోవచ్చు. లేదా వేరుశనగ, బెల్లంతో వేరుశనగ ఉండలు చేసుకొని తినవచ్చు.