Healthhealth tips in telugu

ప్రతి ఇంటిలో ఉండే ఈ మొక్క గురించి ఈ విషయాలు మీకు తెలుసా…అసలు నమ్మలేరు

Nandivardhanam Benefits In telugu : నందివర్ధనం మొక్క సాధారణంగా ప్రతి ఇంటిలోనూ ఉంటుంది. ఈ నందివర్ధనం పువ్వులను ఎక్కువగా పూజకు వాడుతూ ఉంటాం. ఈ పూవులను చెట్టు నుంచి కోసిన తర్వాత కూడా దాదాపుగా రోజంతా తాజాగా ఉంటాయి. నందివర్ధనం పువ్వులలో ఐదు రెక్కల నందివర్ధనం, ముద్ద నందివర్ధనం అని రెండు రకాలు ఉంటాయి.

ఇప్పుడు మనం ఐదు రెక్కల నందివర్ధనం గురించి చెప్పుకుంటున్నాం. ఈ పువ్వులు వర్షాకాలం, ఎండకాలం ఎక్కువ పూస్తాయి. శీతాకాలంలో తక్కువగా పూస్తాయి.నందివర్ధనం పూలు సీజన్ లో లెక్కలేనన్ని పూస్తాయి. ఎక్కువ రోజలు పూస్తాయి. పూసిన పువ్వు కూడా మొక్కకు ఎక్కువ రోజులు ఉంటుంది.

నందివర్ధనం మొక్కలో యాంటీ ఇన్ఫ్ల మేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. అందువల్ల ఈ మొక్క యొక్క ఆకుల రసాన్ని గాయాలకు పై పూతగా రాస్తే తొందరగా నయం అవుతాయి. నందివర్ధనం పువ్వుల రసాన్ని నూనెలో కలిపి ఐ డ్రాప్స్ గా వాడితే ఏమైనా కంటి సమస్యలు ఉంటే తొలగిపోతాయి. ఈ మొక్క వేళ్ళు పంటి సమస్యలను,నోటి సమస్యలను తగ్గించటంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది.

నందివర్ధనం ఆకుల కాషాయన్ని పుక్కిలించటం ద్వారా నోటి సమస్యలను తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా ఈ మొక్క ఆకులలో చర్మ సమస్యలను తగ్గించే గుణాలు అధికంగా ఉన్నాయి. నంది వర్ధనం మొక్క ఆకులు,కాండం, వేళ్ళు, పువ్వులు అన్నింటిలోనూ ఔషడ గుణాలు సమృద్దిగా ఉన్నాయి. తలనొప్పిగా ఉన్నప్పుడు ఈ ఆకుల రసాన్ని నుదురుకి రాస్తే తొందరగా తలనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."