MoviesTollywood news in telugu

ఈ ఫోటోలో లిప్ స్టిక్ రాసుకుంటున్న చిన్నారిని గుర్తు పట్టారా…?

Tollywood Heroine Shalini Pandey : విజయ్ దేవరకొండ గీత గోవిందం మూవీతో స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. అయితే అంతకు ముందు పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి మూవీస్ కూడా మంచి పేరు తెచ్చాయి. అర్జున్ రెడ్డిలో విజయ్ సరసన శాలిని పాండే నటించి మెప్పించింది. నిశ్శబ్దం అనే మూవీలో కూడా చేసినప్పటికీ పెద్దగా పేరు రాలేదు.

తెలుగులో పెద్దగా ఆదరించకపోయినా, బాలీవుడ్ లో శాలిని కి మంచి ఛాన్స్ లు వస్తున్నాయి. ఈమె ఫోటో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పటికే జయేష్ భాయ్ జోర్దార్ మూవీలో నటించింది. ఇది షూటింగ్ పూర్తయి రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇంకో సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది.

సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్న నేపథ్యంలో శాలిని కూడా సోషల్ మీడియాలో తన చిన్నప్పటి ఫోటో షేర్ చేసింది. పెదవులకు లిప్ స్టిక్ రాసుకుంటున్న ఈ ఫోటో చూసి నెటిజన్స్ వావ్, సో క్యూట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ అమ్మడు తెలుగులో మళ్ళీ ఎప్పుడు కనిపిస్తోందో చూడాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."