ఇస్మార్ట్ శంకర్ హీరోయిన్ బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసా ?

Tollywood Heroine nabha natesh :ఇటీవల పూరి జగన్నాధ్, రామ్ పోతినేని కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో రామ్ సరసన నభా నటేష్ జోడీ కట్టింది. అయితే బ్యాక్ గ్రౌండ్ పరిశీలిస్తే కన్నడ అమ్మాయి అయిన ఈమె 1995 డిసెంబర్ 11న జన్మించింది.

శృంగేరిలో ప్రాధమిక విద్య, ఉడిపి ఎన్ ఎం ఏ ఎం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో డిగ్రీ పూర్తిచేసిన నభా నటేష్ భరత నాట్యం నేర్చుకుంది. స్కూల్ డేస్ నుంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ లో పాల్గొనేది. అలాగే జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ దర్శకుడు ప్రకాష్ బెళగాడి దగ్గర నటనలో శిక్షణ తీసుకుంది.

బెంగుళూరులో 2013లో జరిగిన ఫెమినా మిస్ ఇండియా లో నభా నటేష్ టాప్ 11లో నిల్చింది. 2015లో వజ్రకాయ మూవీతో కన్నడ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. ఇందులో శివరాజ్ కుమార్ హీరోగా చేసాడు. నన్ను దోచుకుందువటే మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫొటోస్ తో యూత్ మనసు దోచుకుంటోంది.