MoviesTollywood news in telugu

టాలీవుడ్ ని ఏలేస్తున్న మలయాళీ భామలు ఎంత మందో…?

Tollywood Heroines : ఒకప్పుడు బాలీవుడ్ నుంచి స్టార్ హీరోయిన్స్ ని, అందాల భామలను తెలుగు తెరకు పరిచయం చేసే పరిస్థితి ఎక్కువగా కన్పించేది. ప్రస్తుతం ఇతర భాషల నుంచి కూడా భామలు టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి అదరగొట్టేస్తున్నారు. అలాగే విలన్స్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మళయాళానికి చెందిన పలువురు నటిస్తూ తమ సత్తా చాటుతున్నారు.

తాజాగా మలయాళ చిత్ర రంగానికి చెందిన భామలు తెలుగులో పలు చిత్రాల్లో నటిస్తూ, టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ గా ఎదగబోతున్నారు. అజిత్ హీరోగా నటించిన ఎన్నై అరిందాల్, విశ్వాసం మూవీస్ లో బాలనటిగా నటించిన మలయాళీ కుట్టి అనిఖ సురేంద్రన్ తమిళ, మలయాళ మూవీస్ లో హీరోయిన్ గా చేస్తోంది.

తాజాగా హిట్ కప్పేలా అనే మలయాళీ రీమేక్ తో తెలుగులో ఎంట్రీ ఇస్తోంది. మలయాళీ భామ ఐశ్వర్య లక్ష్మి గడిచిన ఐదేళ్లుగా ఎన్నో హిట్ మూవీస్ లో చేసింది. దాదాపు 15హిట్ మూవీస్ చేసిన ఈమె ప్రస్తుతం మణిరత్నం తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ మూవీ పొన్నియన్ సెల్వన్ మూవీలో చేస్తోంది.

నజ్రియా నజీమ్ .. ఈ మలయాళీ భామ బాలనటిగా ఎంట్రీ ఇచ్చి, హీరోయిన్ గా రాజా రాణి, ఫ్రాన్స్, బెంగుళూరు డేస్ వంటి పలు మలయాళం మూవీస్ లో నటించింది. తాజాగా నేచురల్ స్టార్ నాని సరసన ‘అంటే సుందరానికి’ మూవీలో నటిస్తోంది. ఇక ఈమె భర్త, మలయాళ స్టార్ హీరో ఫాజిల్ ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప మూవీతో తెలుగులో ఎంట్రీ ఇస్తున్నాడు. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా శరత్ మండవ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’మూవీతో వర్ధమాన మలయాళీ నటి రజిషా విజయన్ తెలుగులో ఎంట్రీ ఇస్తోంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."