ఈ ఫోటోలోని చిన్నారిని గుర్తు పట్టారా…రోజు టీవీలో చూస్తున్న హీరోయిన్…!
Tollywood Heroine Raasi : ఇండస్ట్రీలోకి బాలనటిగా వచ్చి, పెద్దయ్యాక హీరోయిన్‌గా తెలుగు, తమిళ పరిశ్రమల్లో టాప్ స్టార్స్‌తో జోడీకట్టి హిట్స్ అందుకున్న హీరోయిన్స్ లో రాశిని ప్రధానంగా చెప్పుకోవాలి. తాజాగా ఈమె చిన్నప్పటి ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. బాలనటిగా చాలా సినిమాల్లో మెప్పించిన ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చాక గోకులంలో సీత మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించి మంచి మార్కులు కొట్టేసింది.
ఇక ఆతర్వాత పెళ్లి పందిరి, మనసిచ్చిచూడు, శుభాకాంక్షలు, స్వప్నలోకం, ప్రేయసి రావే వంటి పలు మూవీస్ లో హీరోయిన్‌గా నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక రాశి చిన్ననాటి ఫోటో ను చూసి, ఈమె రాశి నా అని ఆశ్చర్యపోతున్నామని కామెంట్స్ చేస్తున్నారు. కాగా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే రాశిని పెళ్లి చేసుకోడానికి చాలా మంది శ్రీమంతులు ముందుకొచ్చినా.. ఆమె మాత్రం తాను ప్రేమించిన శ్రీముని అనే అసిస్టెంట్ డైరెక్టర్‌ని పెళ్ళిచేసుకుని తనకు కోట్లు ముఖ్యం కాదని చాటింది.
పెళ్లి తర్వాత కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చిన రాశి తర్వాత సెకండ్ ఇన్సింగ్స్ స్టార్ట్ చేసింది. అయితే కళ్యాణ వైభోగమే, పడేశావే వంటి మూవీస్ చేసింది. అయితే ఇవి పెద్దగా ఆకట్టుకోలేదు. దాంతో గిరిజా కళ్యాణం సీరియల్‌లో నటించి బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది. జానకి కలగనలేదు సీరియల్ లో అత్త పాత్ర తో ప్రస్తుతం అలరిస్తోంది.