MoviesTollywood news in telugu

2021లో టాప్ కలెక్షన్స్ రాబట్టిన మూవీస్ ఎన్ని ఉన్నాయో…?

2021 movies : కరోనా ఎఫెక్ట్ తో ఏప్రియల్ లో థియేటర్లు మళ్ళీ మూతబడి, జులైలో తెరుచుకున్నాయి. జులై ముందు తర్వాత రిలీజైన సినిమాల్లో కొన్ని బ్లాక్ బస్టర్ అయ్యాయి. మరికొన్ని హిట్ అయ్యాయి. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించిన ఈ చిత్రం తొలి భాగం డిసెంబర్ 17న విడుదలైంది. ఇప్పటివరకూ వరల్డ్ వైడ్ 120 కోట్లపైనే వసూలు చేసింది.

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ 85కోట్ల 61లక్షలు వసూలు చేసింది.ఈ మూవీ ఆడుతున్న సమయంలోనే సెకండ్ వేవ్ తో థియేటర్లు మూతపడ్డాయి. నందమూరి నటసింహం బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన ‘అఖండ’మూవీ దుమ్ము రేపింది. బాలయ్య డబుల్ రోల్ తో అదరగొట్టగా కలెక్షన్స్ కూడా దుమ్మురేపాయి.

డిసెంబర్‌ 2న విడుదలైన ఈమూవీ బాలయ్య కెరీర్‌లోనే తొలిసారి అందునా కేవలం పది రోజుల్లోనే 100 కోట్ల మార్క్‌ను అందుకున్నాడు. ఇంకా కలెక్షన్స్ ఉదృతి నడుస్తోంది. జులైకి ముందు వచ్చిన ఉప్పెన మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్, కృతిశెట్టి జంటగా నటించి తొలి సినిమాతోనే ఇద్దరూ బ్లాక్ బస్టర్ అందుకున్నారు.

51కోట్ల 52లక్షలు షేర్ వసూలు చేసింది. అలాగే రవితేజ, గోపీచంద్ మలినేని కాంబోలో వచ్చిన క్రాక్ 39కోట్ల 16లక్షలు షేర్ తెచ్చింది.
రామ్, కిషోర్ తిరుమల కాంబోలో వచ్చిన రెడ్ మూవీ 19కోట్ల 79లక్షల షేర్ రాబట్టింది. నవీన్ పోలిశెట్టి, అనుదీప్ కాంబోలో వచ్చిన జాతిరత్నాలు 38కోట్ల 52లక్షలు షేర్ రాబట్టింది.

శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నాగచైతన్య, సాయిపల్లవి నటించిన లవ్ స్టోరీ మూవీ 35కోట్ల 16లక్షలు షేర్ తెచ్చింది. అక్కినేని అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ కాంబోలో వచ్చిన మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచిలర్ మూవీ 23కోట్ల 75లక్షలు రాబట్టింది. నేచురల్ స్టార్ నాని , రాహుల్ సాహిత్యన్ కాంబోలో వచ్చిన శ్యామ్ సింగరాయ మూవీ 4రోజులకు 19కోట్లు తెచ్చింది. ఫుల్ రన్ లో పాతిక కోట్లు వస్తుందని అంచనా.