MoviesTollywood news in telugu

దాన వీర శూర కర్ణ కి పోటీ ఇచ్చిన సినిమాలు ఎన్ని ఉన్నాయో…?

Daana Veera Soora Karna Movie : నటరత్న ఎన్టీఆర్ మూడు పాత్రలు పోషించిన దాన వీర శూర కర్ణ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్. ఎన్టీఆర్ స్వయంగా రచన, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించి, దుర్యోధనుడిగా, కర్ణుడిగా, కృష్ణుడుగా మూడు విభిన్న పాత్రలు చేసారు. శ్రీకృష్ణ పాండవీయం మూవీలో కర్ణుడిగా తళుక్కున మెరిసిన ఎన్టీఆర్ ఎప్పటికైనా పూర్తిస్థాయి కర్ణుడి పాత్ర చేయాలని భావించి ఈ సినిమాలో నెరవేర్చుకున్నారు.

1977జనవరి 14న సంక్రాంతి కానుకగా వచ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ డైలాగులు, ఆహార్యం కూడా ఎస్వీ రంగారావు ని తలపిస్తాయి. అప్పట్లో 20 లక్షలతో తీసిన ఈ మూవీ మూడు రిలీజ్ లతో కల్పి 3కోట్ల పైనే కలెక్ట్ చేసింది. పెండ్యాల నాగేశ్వరావు సంగీతం సినిమాకు హైలెట్. దాదాపు 4గంటల నిడివి గల దాన వీర శూర కర్ణ మూవీ ఎక్కడా విసుగు విరామం లేకుండా నడిపించడంలో ఎన్టీఆర్ తన సత్తా చాటారు.

9సెంటర్స్ లో 100డేస్ ఆడింది. చిత్రం ఆయ్ భళారే విచిత్రం యుగళ గీతంని దుర్యోధనుడికి పెట్టి, మరో సంచలనం సృష్టించారు. దీంతోపాటు కమలాకర కామేశ్వరరావు డైరెక్షన్ లో సూపర్ స్టార్ కృష్ణ తీసిన కురుక్షేత్రం రిలీజయింది.

అర్జునుడిగా కృష్ణ, కృష్ణుడుగా శోభన్ బాబు, కర్ణుడిగా కృష్ణం రాజు నటించిన ఈ సినిమాకు సాలూరి రాజేశ్వరరావు చక్కటి సంగీతం అందించారు. అయితే ఈ మూవీ దాన వీర శూర కర్ణ ముందు నిలబడలేక పరాజయం పాలైంది. ఇక జనవరి 24న రంభ ఊర్వశి మేనకా మూవీ రిలీజయింది. మురళీమోహన్, నరసింహరాజు కీలక పాత్రలు వేశారు. రావుగోపాలరావు, రోజారమణి కూడా ప్రధాన పాత్రలు చేసారు. పి సాంబశివరావు డైరెక్ట్ చేసిన ఈ మూవీ పరాజయం పాలైంది. మొత్తం మీద దాన వీర శూర కర్ణ నెంబర్ వన్ లో నిల్చింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."