భక్త కన్నప్ప మూవీ షూటింగ్ కి ఎన్ని ఇబ్బందులు వచ్చాయో తెలుసా ?
Baktha kannappa Movie : బాపు దర్శకత్వంలో రెబెల్ స్టార్ కృష్ణంరాజు హీరోగా వచ్చిన భక్త కన్నప్ప మూవీ 1976 మే లో రిలీజై, సూపర్ హిట్ అయింది. వాణిశ్రీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను కృష్ణంరాజు సొంత నిర్మాణ సంస్థ గోపీ కృష్ణ బ్యానర్ మీద తీశారు. గోదావరి తీరంలో అందునా పశ్చిమ గోదావరిలో ఎక్కువ భాగం షూటింగ్ చేసారు.
అప్పట్లో 10లక్షలతో సినిమా తీయాలంటే మహా గొప్ప. అలాంటిది 9లక్షల రూపాయలు కేవలం ఒక సెట్ కోసం వెచ్చించారు. సినిమాకు మొత్తం 20లక్షలు ఖర్చు పెట్టేసారు. పట్టిసీమ గుడిలో ఐదు రోజుల షూటింగ్ చేసారు. ఆరోజుల్లో రవాణా సదుపాయాలు అంతగా లేకున్నప్పటికీ ఎక్కువ మంది జనాన్ని, జూనియర్ ఆర్టిస్టులను ఈ సినిమా కోసం రప్పించారు.
షూటింగ్ చూడ్డానికి వచ్చిన జనానికి కూడా చిత్ర బృందం భోజనాలు పెట్టించారు. ధవళేశ్వరం నుంచి మరబోటు రప్పించి, అందులో జనరేటర్ పెట్టి పట్టిసీమ గుడిలో షూటింగ్ చేసారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెంలో రెండెకరాల స్థలంలో తాడిచెట్లను సగానికి నరికేసి, సెట్టింగ్ వేయడం అప్పట్లో హాట్ టాపిక్. రోడ్లు కూడా చిత్ర యూనిట్ వేసుకుంటూ వెళ్లడం కూడా అప్పట్లో విశేషంగా చెప్పుకునేవారు.

