MoviesTollywood news in telugu

సెలబ్రిటీల పెళ్ళిలో ధరించే నగలు ఏ రేంజ్ లో ఉంటాయో తెలుసా ?

wedding jewelery bollywood celebrities : మాములుగా జరిగే పెళ్ళిళ్ళలోనే హంగామా కనిపిస్తుంది. ఖరీదైన వస్త్రాలు, బంగారం వస్తువులు మెరుస్తాయి. అలాంటిది సెలబ్రిటీల పెళ్లిళ్లు అంటే వేరే చెప్పాలా? అందునా హీరోయిన్స్ పెళ్లిళ్లలో అయితే ఇక చెప్పక్కర్లేదు. విశ్వసుందరి ఐశ్వర్యా రాయ్ సినిమా ఇండస్ట్రీలో సత్తా చాటి, బిగ్ బి అమితాబ్ తనయుడు అభిషేక్ బచ్చన్ ని పెళ్లాడింది.

అయితే ఐశ్వర్య, అభిషేక్ పెళ్లి సందర్బంగా బంగారు తీగతో కూడిన 75లక్షల విలువైన చీరను ఐశ్వర్య ధరించిందని, పైగా దాదాపు మూడున్నర కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు వేసుకుందని ఇప్పటికీ వార్తలు హల్ చల్ చేస్తుంటాయి. ఇక విరాట్ కోహ్లీని 2017లో పెళ్లాడిన అనుష్క శర్మ 45లక్షలు విలువచేసే లెహంగా ధరించింది. దీన్ని ప్రత్యేకంగా డిజైన్ చేయించారట. ఇక మూడు కోట్ల విలువైన బంగారు ఆభరణాలను ధరించిందని టాక్.

శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా పెళ్లి సందర్బంగా శిల్పా 50లక్షల విలువైన లెహంగా ధరించిందని అంటారు. అంతేకాకుండా 5కోట్ల విలువైన రింగ్ ధరించిందట. రణవీర్ సింగ్ ని పెళ్లాడిన దీపికా పదుకునే 20లక్షల విలువచేసే మంగళ సూత్రం, కోటిన్నర విలువ చేసే ఆభరణాలు ధరించింది. .

2018లో నిక్ జోన్స్ ని పెళ్లాడిన ప్రియాంక చోప్రా ఖరీదైన లెహంగా, దాదాపు 4కోట్ల విలువైన ఆభరణాలు ధరించిందని చెబుతారు. ఇక తాజాగా విక్కీ కౌశల్ ని పెళ్లాడిన బాలీవుడ్ సుందరి కత్రినా కైఫ్ 17లక్షల విలువ గల లెహంగా, 7లక్షల 40వేలు విలువ గల రింగ్ ధరించిందని టాక్.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."