ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి స్టార్ హీరోయిన్…గుర్తు పట్టారా…?
Tollywood actress ileana : సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వస్తున్న సెలబ్రిటీల పోస్టింగ్స్ లో భాగంగా గోవా బ్యూటీ ఇలియానా కు సంబంధించిన చిన్ననాటి ఫోటో ఒకటి ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. వైవిఎస్ చౌదరి డైరెక్ట్ చేసిన దేవదాస్ మూవీలో రామ్, ఇలియానా హీరో హీరోయిన్స్ టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు. తొలిచిత్రంతోనే భారీ హిట్ కొట్టారు. తర్వాత ఇలియానా అగ్ర హీరోలందరి సరసన చేసింది.
ప్రస్తుతం ఛాన్స్ లు అంతగా లేని ఇలియానా ఇటీవల రీ ఎంట్రీ ఇచ్చింది. గతంలో పోకిరిలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించిన ఇండస్ట్రీ హిట్ అందుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో జల్సా మూవీస్ చేసి హిట్స్ కొట్టింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ ఇలా అందరి సరసన నటించి మెప్పించింది.
అయితే ఓ విదేశీ క్రీడాకారుడి ప్రేమలో పడి కొన్నాళ్ళు ఇండస్ట్రీకి దూరమైన ఇలియానా ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో సత్తా చాటాలని చూస్తోంది. అయితే ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫొటోస్ కూడా షేర్ చేస్తూ ఉంటుంది. ఇక తాజాగా ఈమె చిన్నప్పటి ఫోటో వైరల్ కావడంతో ఫాన్స్ సో క్యూట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.