అల్లు అర్జున్ డైట్ ప్లాన్…ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాడో…?
Allu Arjun Diet Plan : నటనలో ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ స్టైలిష్ స్టార్ నుంచి ప్రస్తుతం ఐకాన్ స్టార్ గా ఎదిగిన అల్లు వారి అబ్బాయి అల్లు అర్జున్ ఆరోగ్యం విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటిస్తూ, ఆహార నియమాలను అనుసరిస్తూ ఫిట్ నెస్ కాపాడుకుంటున్నాడు. ఉదయం నిద్ర లేవగానే ముప్పావు గంట పాటు త్రెడ్ మిల్ పై రన్నింగ్ పూర్తిచేసి, ఓ కప్పు కాఫీ/ ఓ గ్లాస్ జ్యూస్ తాగుతాడు.
ఉదయం 7న్నర 8గంటల మధ్య 3 గుడ్లలో సొన లేకుండా, ఒక గుడ్డు సొన ఉండేలా మొత్తం 4గుడ్లతో ఆమ్లేట్ వేసుకుని బ్రేక్ ఫాస్ట్ ముగిస్తాడు. ఉదయం 11న్నర నుంచి 12గంటల సమయంలో లంచ్ కి ముందుగా సూప్, గ్రీన్ సలాడ్ తీసుకుంటాడు. అందులో ప్రోటీన్స్ కోసం ఎగ్/ చికెన్ ఉండేలా చూసుకుంటాడు. మధ్యాహ్నం 1న్నర నుంచి 2గంటల్లోగా మాసం, కార్బోహైడ్రేట్స్ ఉండేలా చూసుకుని లంచ్ చేస్తాడు.
ఇక సాయంత్రం 4న్నర నుంచి 5గంటల మధ్య ఉడక బెట్టిన గింజలు, కాఫీ/ జ్యూస్ స్నాక్స్ గా తీసుకుంటాడు. బ్రౌన్ రైస్, కూరగాయలు, చికెన్ / చేపలతో డిన్నర్ పూర్తిచేస్తాడు. మొత్తం మీద జున్ను, పాల పదార్ధాలను దాదాపు దూరం పెట్టి తన డైట్ కొనసాగిస్తూ ఫిట్ నెస్ గా ఉంటున్నాడు.

