కృష్ణ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ఊరికి మొనగాడు గురించి ఈ నిజాలు తెలుసా?

Ooriki Monagadu Movie : సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఊరికి మొనగాడు మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్. 7సెంటర్స్ లో డైరెక్ట్ గా, 4చోట్ల నూన్ షోస్ తో 100డేస్, 3సెంటర్స్ లో 200డేస్ ఆడింది. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ మూవీలో జయప్రద హీరోయిన్ గా అదరగొట్టింది. 1981సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కింది.

భలే దొంగలు, ఘరానా దొంగ మూవీస్ కృష్ణ, రాఘవేంద్రరావు కాంబోలో వచ్చి హిట్ అయినా, ఫాన్స్ కి పెద్దగా కిక్కు ఇవ్వలేదు. కానీ మూడవ చిత్రం ఊరికి మొనగాడుని మాస్ ఎంటర్ టైనర్ గా దర్శకేంద్రుడు తీర్చిదిద్దారు. కృష్ణ యాక్షన్, జయప్రద గ్లామర్ తో వినోదం పండించిన ఈ సినిమా ఎమోషన్ కూడా జోడించారు.

కథ కూడా వినకుండా కృష్ణ ఒకే చెప్పిన మూవీస్ లో ఊరికి మొనగాడు ఒకటి. దర్శకేంద్రుడి మీద నమ్మకంతోనే కృష్ణ ఒకే చెప్పారు. చక్రవర్తి మ్యూజిక్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. నిజానికి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ మార్నింగ్ షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సిస్టర్, మదర్ సెంటిమెంట్, టీజింగ్ వంటి అంశాలతో ఈ మూవీ తెరకెక్కించగా, 1977లో విషాదం మిగిల్చిన దివిసీమ ఉప్పెనను సందర్భోచితంగా రాఘవేంద్రరావు వినియోగించారు.

ఈ సందర్భంలో తీసిన కదిలి రండి మనుషులైతే గీతం కూడా ఆడియన్స్ ని కట్టిపడేసింది. ఇదిగో తెల్లచీర ఇవిగో మల్లెపూలు, అందాల జవ్వని మందార పువ్వని వంటి చక్రవర్తి బాణీలకు ఫాన్స్ చేత స్టెప్పులు వేయించాయి. ఆ ఏడాది జనవరి 1న అక్కినేని శ్రీవారి ముచ్చట్లు, 9న శోభన్ బాబు నటించిన జగమొండి, 12న శోభన్ దేవుడు మావయ్య మూవీస్ వచ్చాయి.

కృష్ణంరాజు నటించిన ఆడవాళ్ళూ మీకు జోహార్లు మూవీ వచ్చింది. ఈ సినిమాల్లో శ్రీవారి ముచ్చట్లతో హిట్ అందుకుని అక్కినేని కొత్త ఏడాదికి శుభారంభం చేసారు. ఇక ఊరికి మొనగాడు తర్వాత నెలరోజులకు అక్కినేని ప్రేమాభిషేకం రిలీజై, బాక్సాఫిస్ ని ఊపేసింది. అయినా సరే, ఊరికి మొనగాడు సత్తాచాటింది.

గుంటూరు జిల్లా హక్కులు శ్రీదేవి తల్లి 3. 2కోట్లకు కొంటె డబుల్ ప్రాఫిట్ వచ్చింది. ఏప్రియల్ లో మద్రాసు హోటల్ లో 100డేస్ ఫంక్షన్ కి ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్. ఇక ఈ మూవీని హిందీలో అనిల్ కపూర్ , శ్రీదేవిలతో హిమ్మత్ వాలాగా పద్మాలయ బ్యానర్ మీద దర్శకేంద్రుడి డైరెక్షన్ లో కృష్ణ రీమేక్ చేసి హిట్ అందుకున్నారు.