అమాయకపు చూపులతో కట్టిపడేస్తున్న ఈ చిన్నారిని గుర్తు పట్టారా…?

Tollywood Heroine kalyani priyandarshan : ప్రస్తుతం బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ సినీ సెలబ్రిటీలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోస్, రేర్ ఫోటోస్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. వాళ్ళు వీళ్ళు అని లేదు సీనియర్ హీరో, హీరోయిన్స్ మొదలుకుని ఇప్పటి యంగ్ సెలబ్రెటీల వరకూ అందరి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాను ఆకర్షిస్తోంది.

ఇందులో ఉన్న ఇద్దరు చిన్నారులు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్స్ గా వరుస ఛాన్స్ లతో దూసుకుపోతున్నారు. అయితే ఇందులో అమాయకపు చూపులతో, బూరెల్లాంటి బుగ్గలతో కట్టిపడేస్తున్న ఓ చిన్నారి భారీ ఫాన్ ఫాలోయింగ్ తో అదరగొట్టేస్తోంది. అక్కినేని అఖిల్ నటించిన హలో మూవీతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఎవరో కాదు పాపులర్ హీరోయిన కళ్యాణి ప్రియదర్శన్.

ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ – సీనియర్ నటి లిస్సి లక్ష్మి పుత్రిక అయిన కళ్యాణి ప్రియదర్శి హీరోయిన్ గా చేస్తూ సత్తా చాటుతోంది. ఇప్పుడు తమిళ్ సినిమాల్లో కూడా అదరగొడుతోంది. తెలుగులో హలో సినిమా తర్వాత చిత్రలహరి మూవీ చేసింది. ఇక శర్వానంద్ హీరోగా నటించిన రణరంగం సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ మంచి నటన కనబరిచి ఆడియన్స్ మనసు దోచుకుంది.