శరీరంలో ఇమ్మ్యూనిటి కోసం వీటిని వాడుతున్నారా….రిస్క్ లో పడినట్టే
Immunity Foods In telugu :ఇప్పుడు ఉన్న పరిస్థితులను ఎదుర్కోవటానికి ప్రతి ఒక్కరు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అలాగే డాక్టర్ సలహా లేకుండానే విటమిన్ సి టాబ్లెట్స్ వాడేస్తున్నారు. మొన్నటి వరకు ఈ టాబ్లెట్స్ తక్కువగా దొరికేవి రేటు కూడా తక్కువగానే ఉండేది.

ఇప్పుడు విటమిన్ సి టాబ్లెట్స్ వాడకం పెరగటంతో ఉత్పత్తితో పాటు రేటు కూడా పెరిగిపోయింది . కొన్ని చోట్ల అయితే విటమిన్ సి టాబ్లెట్స్ కూడా దొరకటం కష్టం అవుతుంది. కొంతమంది విటమిన్ సి టాబ్లెట్స్ ఎక్కువగా కొనేసి ఇంటిలో స్టాక్ పెట్టుకుంటున్నారు. అయితే వైద్యులు మాత్రం విటమిన్లను ఆహార రూపంలో తీసుకోవడానికి ప్రయత్నం చేయమని చెప్పుతున్నారు.
డాక్టర్ సలహా లేకుండా విటమిన్ సి టాబ్లెట్స్ ఇష్టం వచ్చినట్టు వేసుకోకూడదని చెప్పుతున్నారు. విటమిన్ – సి ఎక్కువగా తీసుకుంటే డయేరియా, వాంతులు, చాతిలో మంట లాంటి లక్షణాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్య అధికారులు తెలియజేస్తున్నారు.ఇక సి విటమిన్ పుష్కలంగా దొరకాలంటే నిమ్మరసం, బత్తాయి, నారింజ, కమల పండ్లు లాంటివి తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
అలాగే పెరుగులో కూడా పుష్కలంగా మంచి బ్యాక్టీరియా లభిస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.ఏది ఏమైనా డాక్టర్ సలహా తీసుకొని మాత్రమే మందులు వాడటం మంచిది. మనకు నచ్చిన విధంగా మందులను వాడితే కొన్ని సమస్యలు వస్తాయి. అందువల్ల తప్పనిసరిగా డాక్టర్ సలహాతో మాత్రమే మందులను వాడాలి.

